NARA LOKESH: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌.. అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోందా..?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌ను అరెస్ట్‌ చేయబోతున్నారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో లోకేశ్‌ను ఏ14 నిందితుడిగా నమోదు చేసింది సీఐడీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 02:44 PMLast Updated on: Sep 26, 2023 | 2:44 PM

Cid Named Nara Lokesh As A14 In Inner Ring Road Scam

NARA LOKESH: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ అరెస్ట్ తప్పదా..? స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టిన సీఐడీ.. ఇప్పుడు లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నారా లోకేశ్ అరెస్ట్‌కు సీఐడీ రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్ పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తర్వాత లోకేశ్, అచ్చెన్నాయుడు అరెస్ట్ అవుతారని.. మైక్‌ల ముందు బహిరంగంగా చెప్పేశారు నాయకులు.

ఐతే అది నిజమే అని ప్రూవ్ చేసేందుకు సీఐడీ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. కానీ, మంత్రులు ఆరోపించినట్లు స్కిల్ స్కామ్ కేసులో కాకుండా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌ను అరెస్ట్‌ చేయబోతున్నారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో లోకేశ్‌ను ఏ14 నిందితుడిగా నమోదు చేసింది సీఐడీ. దీంతో లోకేశ్‌ అరెస్ట్ ఖాయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న లోకేశ్.. ఈనెల 27న రాజమహేంద్రవరం రానున్నారు. ఆ తర్వాత యువగళం పాదయాత్రలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతుండగా.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో సీఐడీ లోకేశ్‌ను నిందితుడిగా చేర్చడంపై టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత యువగళం యాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేశ్‌.. ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ తీసుకువచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఐతే అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు.

దీంతో నిరాశగా వెనుదిరిగిన లోకేశ్‌కు షాక్ ఇచ్చేందుకు సీఐడీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయననే లోపల వేసేందుకు ఇక్కడ రంగం సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా.. ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారన్నది వైసీపీ సర్కార్ ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ, అవినీతి నిరోధకచట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్‌ చేసి విచారణ మెుదలు పెట్టింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు పలువురిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఇప్పుడు లోకేశ్ పేరు కూడా చేర్చింది.