జానీ మాస్టర్‌ను నిలదీయవా.. ఎక్కడున్నావ్ సేఫ్ హ్యాండ్స్..
మీద రేప్ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు.. కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మీద రేప్ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు.. కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను చర్లపల్లి జైలులో ఉన్నాడు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు.. జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అతన్ని గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఈ కేసుకు సంబంధించి.. ఇండస్ట్రీ నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ముఖ్యంగా డ్యాన్సర్లు అయితే.. జానీకి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ కేసు వెనక కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇక హీరోల్లో ఒక్క మంచు మనోజ్ మాత్రమే జానీ మాస్టర్ రేప్ కేసు మీద రియాక్ట్ అయ్యాడు. తప్పు చేయకుండా.. పోరాడు జానీ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఐతే ఏ చిన్న ఘోరం జరిగినా.. నేరం జరిగినా.. వెంటనే రియాక్ట్ అయ్యే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మాత్రం.. పత్తా లేకుండా పోయాడు. దీంతో నెటిజన్లు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది.
కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ ఫొటో ట్వీట్ చేస్తూ.. ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉందంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు జానీ మాస్టర్‌తో సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ .. జానీ మాస్టర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటూ వెటకారం చేస్తున్నారు. ఏం చేస్తున్నావ్ తేజ్.. రియాక్ట్ కావా అంటూ ట్యాగ్ చేస్తున్నారు. ఆ మధ్య యూట్యూబర్ హనుమంతు.. చిన్నపిల్లలపై లైంగిక కామెంట్లు చేయగా.. సాయిధరమ్ తేజ్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఓ లేడీ డ్యాన్సర్ తనను రేప్ చేశాడు అంటే ఎందుకు స్పందించట్లేవ్ అంటూ నిలదీస్తున్నారు. జానీ మాస్టర్ జనసేన కార్యకర్త, మెగా హీరోలకు అత్యంత సన్నిహితుడనే.. అతనిపై స్పందించడానికి సాయిధరమ్ తేజ్ మాటా రావట్లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.