Pawan Kalyan: ఏపీ బంద్‌కు జనసేన మద్దతు.. పొత్తుపై క్లారిటీ వచ్చినట్టేనా..?
బాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ బంద్‌కు వామపక్షాలతో పాటు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని చెప్తున్న బీజేపీ మాత్రం ఈ బంద్‌కు మద్దతు తెలపలేదు.
Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ అట్టుడికిపోతోంది. ఉదయం నుంచి ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసిందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఈ బంద్‌కు వామపక్షాలతో పాటు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని చెప్తున్న బీజేపీ మాత్రం ఈ బంద్‌కు మద్దతు తెలపలేదు.
దీంతో జనసేన, టీడీపీ కలిసే ఉన్నాయనే చర్చ మొదలైంది. చాలా కాలం నుంచి వైసీపీ నేతలు జనసేనపై చేస్తున్న ఆరోపణ కూడా ఇదే. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. జనసేన.. టీడీపీకి బీ పార్టీ అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జనసేన నిర్ణయంతో ఈ ఆరోపణలు మరోసారి మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కోసం కాకుండా టీడీపీని బీజేపీని కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. తాను సీఎం అవ్వడం కంటే చంద్రబాబును సీఎం చెయ్యడమే పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలను జనసేన ఎలా డిఫెండ్ చేస్తుందో చూడాలి.