TDP– JANASENA CLASH: ఇదేంది.. ఇప్పుడే ఇంత గోల ! కలిసి ఎలా పోటీ చేస్తారు మరి !!

అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టాలని లోకేష్, పవన్ కల్యాణ్ డిసైడ్ చేశారు. కానీ నియోజకవర్గాల్లో అలాంటి సామరస్య పరిస్థితులు ఏవీ కనిపించడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 18, 2023 | 07:11 PMLast Updated on: Nov 18, 2023 | 7:11 PM

Clash Between Leaders Of Janasean And Tdp

TDP– JANASENA CLASH: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని అధికారం నుంచి దింపడానికి తాము ఏకమవుతున్నట్టు టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు పెట్టాలని లోకేష్, పవన్ కల్యాణ్ డిసైడ్ చేశారు. కానీ నియోజకవర్గాల్లో అలాంటి సామరస్య పరిస్థితులు ఏవీ కనిపించడం లేదు. రెండు పార్టీల లీడర్లు, కార్యకర్తలు జుట్లు పట్టుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. పొత్తులో ఏ సీటు ఏ పార్టీకి పోతుందో తెలీదు.

BRS SENTIMENT: బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా ? జాతీయ పార్టీని మడత పెట్టేశారా..?

దాంతో ఇప్పటి నుంచే టీడీపీ, జనసేన లీడర్లు.. నువ్వా నేనా అన్నట్టుగా కలియబడుతున్నారు. ఈ రెండు పార్టీలకే సఖ్యత లేదురా బాబూ అనుకుంటుంటే.. జనసేనతో పొత్తు కంటిన్యూ చేస్తామని ఏపీ బీజేపీ కూడా ప్రకటించింది. 2024 లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడం ఏమో గానీ.. టీడీపీ, జనసేనకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతల్లో ఏ మాత్రం సఖ్యత కుదరడం లేదు. ఆత్మీయ సమ్మేళనాలతో కింది స్థాయి లీడర్ల మధ్య సమన్వయం తేవాలని రెండు పార్టీల హైకమాండ్స్ నిర్ణయించాయి. కానీ అదే ఆత్మీయ సమ్మేళనాలే రెండు పార్టీల నేతల మధ్య గొడవలకు కారణం అవుతున్నాయి. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే జగ్గంపేట, ముమ్మడి వరం, కొత్తపేట లాంటి ప్రాంతాల్లో జరిగిన మీటింగ్స్ లో టీడీపీ, జనసేనాని లీడర్లు బాహా బాహీకి దిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం.. టీడీపీ, జనసేన లీడర్లు నియోజకవర్గాల్లో ఎవరికి వారే టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు.

తీరా ఇప్పుడు పొత్తులో భాగంగా వేరే పార్టీకి తమ సీటు పోతే ఎలా అని ఆందోళనలో ఉన్నారు. గత నాలుగున్నరేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. ఇప్పుడు తమ సీటు ఎలా వదులుకుంటామని రెండు పార్టీల లీడర్లు ఆలోచిస్తున్నారు. అందుకే ఏదైతే అది అయిందని.. ముందే గొడవలకు దిగుతున్నారు టీడీపీ., జనసేన నేతలు. రెండు పార్టీల గొడవలు ఇలా ఉంటే.. తాము జనసేనతో పొత్తులో ఉన్నామంటోంది ఏపీ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే వెళ్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అప్పుడు మూడు పార్టీల లీడర్ల మధ్య యుద్ధం తప్పేలా లేదు.

MLA JEEVANREDDY: ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..

జగన్‌ను ఓడించడం ఏమో గానీ.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. ఒకరినొకరు ఓడించుకోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాల్సి వస్తుందేమో. ముందే మొదలైన గొడవలను లోకేష్, పవన్ కల్యాణ్ సద్దుమణిగేలా చేస్తే బెటర్. లేదంటే 2024 ఎన్నికల్లో ఈ గొడవలు భస్మాసుర హస్తంలాగా మారే ఛాన్సుంది.