కోడిపందాలు ఆడుకోండి: చంద్రబాబు సెన్సేషనల్
కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని పేర్కొన్నారు.

కోడి పందాల నిర్వహణపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు. సంప్రదాయాలు కాపాడుతూ పండుగ వాతావరణాన్ని అంతా ఆస్వాదించాలని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి జల్లికట్టు చూసేవాడినన్నారు. జల్లికట్టును చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చేవారని.. అన్ని ఊళ్ళల్లోనూ ఎప్పటి నుంచో కోడి పందాలు ఉన్నాయి, కత్తులు కూడా కట్టేవారని తెలిపారు.
జల్లికట్టుని నివారించాలంటే చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మన పండుగను మనం ఘనంగా జరుపుకోవాలని ఈసారి అంతా బాధ్యత తీసుకున్నారన్నారు. దాదాపు 10లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ఏపీ కి తరలివచ్చారని తెలిపారు.