పరువు తీస్తున్నారు: అధికారులపై చంద్రబాబు ఫైర్
కేబినెట్ సమావేశంలో పలు పథకాల అమలు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు..
కేబినెట్ సమావేశంలో పలు పథకాల అమలు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. డీపీఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావడం లేదని సీఎం మండిపడ్డారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని దిల్లీలోనూ ప్రచారం జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ చంద్రబాబుకు చెప్పారు.
మిషన్ మోడ్ లో పనిచేస్తే పథకం అధ్భుత ఫలితాలను ఇస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మంత్రుల పనితీరు పై సీఎం చర్చించారు. డిసెంబర్ 12 కు ఆరు నెలలు పూర్తవుతున్న నేపద్యంలో సెల్ఫ్ అసెస్మెంట్ సమర్పించాలని మంత్రులను సిఎం కోరారు. మంత్రుల సెల్ఫ్ అసెస్మెంట్ ను చూసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇస్తానని అన్నారు.