REVANTH REDDY: పదవులు పందేరం.. ఢిల్లీకి రేవంత్, భట్టి.. మంత్రి పదవుల లిస్ట్‌లో ఎవరంటే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు.
REVANTH REDDY: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు నామినేట్ పదవుల లిస్ట్ ఫైనల్ చేసేందుకు ఆయన డిప్యూటీ సీఎం భట్టితో కలసి ఢిల్లీకి వెళ్ళారు. కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైల్వే ప్రాజెక్టులపైనా చర్చించబోతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు.. రేవంత్ పర్యటనపై బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పైరవీలు మొదలుపెట్టారు.
YS SHARMILA: ఘనంగా షర్మిల కొడుకు పెళ్లి.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు. ఇంకో ఆరుగురికి అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని టాక్ నడుస్తోంది. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మంత్రి వర్గ విస్తరణతో పాటు.. నామినేటెడ్ పదవులను కూడా తొందరగా తేల్చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండు పనులు పూర్తయితే జిల్లాల్లో వీలైనంత ఎక్కువ మంది సపోర్ట్ తనకు ఉంటుందని భావిస్తున్నారు. ఇక మంత్రి వర్గంలో చేర్చుకోబోయే ఆరుగురు విషయంలో రేవంత్ ఇప్పటికే ఓ స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో మొదటగా ప్రొఫెసర్ కోదండరామ్‌కి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రమాణస్వీకారం ఆగిపోయింది. అయినప్పటికీ కోదండరామ్‌ని కేబినెట్‌లోకి తీసుకోవాలని రేవంత్ నిర్ణయించారు.
YS JAGAN: అవ్వ.. తాత.. ఇద్దరికీ పెన్షన్.. సంచలనాలకు కేరాఫ్‌గా జగన్ మేనిఫెస్టో..
మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలల్లోపు ఆయన చట్టసభలకు ఎన్నిక అవ్వాలి. హైకోర్టులో కేసు తేలిపోతే.. గవర్నర్ కోటాలోనే కోదండరామ్‌కి ఎమ్మెల్సీ ఇచ్చే అకాశం ఉంది. ఇంకా మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కని జిల్లాలపై రేవంత్ దృష్టిపెట్టారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు ఈసారి విస్తరణలో అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రి పదవి కోసం పోటీపడుతున్నట్టు సమాచారం. అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్.. అధిష్టానం దగ్గర పరవీలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మలిరెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఉన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత కొత్త మంత్రులకు శాఖలతోపాటు ఇప్పటికే ఉన్నవారి పోర్ట్ ఫోలియోల్లోనూ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. కోదండరామ్‌ను కేబినెట్ లోకి తీసుకుంటే.. ఆయనకు విద్యాశాఖ అప్పగిస్తారు.
ఇక కొండా సురేఖను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హోంమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఈ పదవికి మొదట సీతక్క అనుకున్నప్పటికీ.. ఆమె మాజీ నక్సలైట్ కావడంతో పోలీస్ అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సుంది. అందుకే కొండా సురేఖకు హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారన్ టాక్. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాలన్నది సీఎం రేవంత్ ప్లాన్. దాంతో కాంగ్రెస్ మరింత జోష్‌తో రాబోయే ఎన్నికల్లో పనిచేస్తుందని భావిస్తున్నారు.