Pawan Kalyan: పవన్ ఇమేజ్ పెంచేస్తున్న జగన్.. తనకు పోటీ పవనే అని ఫిక్సయ్యారా..?
నిజానికి పవన్‌కు అభిమానగణం తప్ప రాజకీయపార్టీగా పెద్దగా బలం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణమే ఇంకా జరగలేదు. పలు నియోజవకర్గాలకు ఇంఛార్జిలే లేరు. ఇంత బలహీనంగా ఉన్న పార్టీని సాధారణంగా ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కానీ, వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్‌ను సీరియస్‌గా తీసుకుంది.
Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తుంటే.. పవన్‌ను జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్ వర్సెస్ జగన్‌గా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. పవన్ విమర్శలకు సమాధానం చెప్పకుండా.. జగన్ మాత్రం పవన్ వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నాడు. దీనివల్ల పవన్ ఇమేజ్ తగ్గకపోగా పెరుగుతోంది. పవన్ రాజకీయంగా బలపడ్డాడు. జనసేన ఓటు బ్యాంకు ఇప్పుడు ఐదు శాతం నుంచి పన్నెండు శాతానికి పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. పవన్ ఇమేజ్ పెరగడానికి జగనే కారణం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పలు సర్వేల ప్రకారం, గత ఎన్నికల్లో ఓట్ల శాతం ప్రకారం.. జనసేనకు ఐదు శాతమే ఓటు బ్యాంకు ఉంది. ఇది ఏమాత్రం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ఇది పన్నెండు శాతానికి చేరిందని సర్వేలు చెబుతున్నాయి. కారణం.. పవన్ కల్యాణ్‌కు జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వడమే. నిజానికి పవన్‌కు అభిమానగణం తప్ప రాజకీయపార్టీగా పెద్దగా బలం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణమే ఇంకా జరగలేదు. పలు నియోజవకర్గాలకు ఇంఛార్జిలే లేరు. పార్టీలోనూ చెప్పుకోదగ్గ నేతలు కనబడరు. ఆర్థికంగానూ బలం లేదు. మీడియా సహకారమూ లేదు. ఇంత బలహీనంగా ఉన్న పార్టీని సాధారణంగా ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కానీ, వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్‌ను సీరియస్‌గా తీసుకుంది. పవన్ ఎక్కడ సభ పెట్టినా, ర్యాలీ నిర్వహించినా, ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీ నుంచి వెంటనే రియాక్షన్ వస్తుంది. ఆ పార్టీ మంత్రులు పవన్‌పై విరుచుకుపడుతుంటారు. పవన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ, వైసీపీ అనుకూల మీడియాలోనూ ఒకటే స్టోరీలు. ఇదంతా ఒక ఎత్తు.. పవన్‌ను నేరుగా సీఎం జగన్ టార్గెట్ చేయడం మరో ఎత్తు.
వ్యక్తిగత విమర్శలే
పవన్ వ్యూహాత్మకంగా వైసీపీని ప్రశ్నిస్తుంటారు. అనేక అంశాల్ని లేవనెత్తుతుంటారు. అవినీతి గురించి, హామీల గురించి అడుగుతారు. పవన్ ఏం అడిగినా దానికి జగన్ నుంచి వచ్చే సమాధానాలు మాత్రం మారవు. మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, పెళ్లాలను మార్చేస్తాడు, ప్యాకేజీ అంటూ అవే విమర్శలు చేస్తాడు. కొన్నేళ‌్లుగా జగన్, ఆయన పార్టీ నేతలు అవే విమర్శలు చేస్తూ వస్తున్నారు. పవన్ అడిగే ఏ ప్రశ్నకూ జగన్ నుంచి సరైన సమాధానం ఉండదు. పవన్ ఇమేజ్ తగ్గేలా మాట్లాడాను అనుకుంటారేమో జగన్. కానీ, దీనివల్ల పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదేం లేదు. పైగా పవన్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. జగన్ తనను వ్యక్తిగతంగా ఎంత టార్గెట్ చేసినా, పవన్ వాటిపై పెద్దగా స్పందించరు. తనదైన శైలిలో హుందాగానే బదులిస్తారు. పవన్ వాడే పదజాలం కూడా అంత ఘాటుగా ఉండదు. ఏ రకంగా చూసినా పవన్‌కు రాజకీయంగా లాభమే తప్ప నష్టం లేదు. పవన్‌కు అంత ప్రాధాన్యం ఇచ్చి, ఆయన ఇమేజ్‌ను జగన్ అమాంతం పెంచేస్తున్నారు. తనకు సరితూగగల లీడర్ పవనే అని భావించడం వల్ల, పవన్‌ను అడ్డుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. పవన్‌కు పొలిటికల్ మైలేజ్ ఇస్తున్నాయి. వైసీపీ ఇలాగే వెళ్తే పవన్ ఇంకా బలపడటం ఖాయం. స్ట్రాటజీ మార్చకపోతే ఈ విషయంలో వైసీపీకి నష్టమే.