CM Jagan: ఎన్డీఏలో చేరే ఆలోచనలో జగన్‌.. ఏపీ బీజేపీకి అన్నీ మంచి శకునములేనా..

ఏపీ రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో అంచనా వేయలేని పరిస్థితి. జగన్‌ ఢిల్లీలో ఉన్నప్పుడు.. కేబినెట్ మీటింగ్ అని ఇక్కడ ప్రకటన రావడం.. కేంద్ర పెద్దలతో జగన్‌ రహస్యం భేటీ జరగడంతో ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 1, 2023 | 05:00 PMLast Updated on: Jun 01, 2023 | 5:00 PM

Cm Jagan Join In Nda

ఆగస్ట్‌లో అసెంబ్లీ రద్దు చేసి.. జగన్‌ ముందస్తుకు వెళ్తారా అనే అనుమానాలు మొదలయ్యాయ్. అదే సమయంలో జగన్‌ ఢిల్లీ టూర్ తర్వాత.. అవినాశ్‌ రెడ్డి విషయంలో ఊరట లభించడం కూడా కొత్త చర్చకు కారణం అవుతోంది. ముందస్తుకు సంబంధించి కేంద్రం నుంచి జగన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఒకసారి.. వైసీపీకి బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తోందని మరోసారి ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడో కొత్త విషయం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎన్డీఏలో వైసీపీ చేరబోతుందనే ప్రచారం.. ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ వరకు రీసౌండ్ ఇస్తోంది. ఇన్నాళ్లు బీజేపీకి బయటి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తున్న వైసీపీ.. నిజంగా ఎన్డీఏలో చేరితే ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ తలరాత మారినట్లే అనే చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎదగాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఉన్న వాళ్లను వదులుకోలేదు.. వాళ్లతో చేరలేదు అన్నట్లుగా ఏపీలో బీజేపీ పరిస్థితి తయారయింది. ఒకరకంగా పొలిటికల్ కార్నర్‌లో నిల్చొని.. అమాయకంగా దిక్కులు చూస్తున్న పరిస్థితి కమలం పార్టీది ! అటు టీడీపీ, జనసేన వైపు వెళ్లాలా.. వైసీపీకి సపోర్టు చేయాలా.. లేదంటే సింగం సింగిల్ అన్నట్లు ఉండాలా అనే విషయాలు తెలియక.. తేల్చుకోలేక నానా తంటాలు పడుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ నుంచి వైసీపీకి ఆఫర్ వచ్చిందని.. దానికి జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారని.. ఎన్డీఏలో కలిసేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారని.. ఏపీ కేబినెట్‌ మీటింగ్ తర్వాత ప్రకటన వచ్చే చాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది.

వైసీపీలాంటి పార్టీ తమతో జట్టు కడితే.. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీకి అన్నీ మంచి శకునములే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుతం ఎన్డీఏ.. మిత్రపక్షాల కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. బలమైన పార్టీలన్నీ దాదాపు బీజేపీకి దూరం అయ్యాయ్. భారీగా ఎంపీ సీట్లు గెలిచే సత్తా ఉన్న పార్టీ ఒక్కటి కూడా లేదు లెక్క తీస్తే. శివసేన, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలన్నీ దూరం అయ్యాయ్. శివసేన , జేడీయూ మళ్లీ కలిసి వచ్చే చాన్స్ లేదు. వస్తే దక్షిణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి. చంద్రబాబు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. గత అనుభవాలతో కమలం పార్టీ ఆలోచనలో పడింది. దీన్నే జగన్ అవకాశంగా మార్చుకున్నారు.

ఎన్డీఏలో టీడీపీ చేరితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే.. ముందుగానే ఆయన ఈ ప్రతిపాదన బీజేపీ పెద్దల ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఐతే ఎన్డీఏతో కలవడం జగన్‌కు ఎలాంటి మేలు చేస్తుందన్న సంగతి పక్కనపెడితే.. బీజేపీకి మాత్రం బంగారు పళ్లెంలో ఫుల్‌ మీల్స్ పెట్టినట్లే! ఏపీలో ఎలాగైనా ఎదగాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. వైసీపీ అండగా నిలిస్తే పని ఈజీ అవుతుంది. ఎంపీ సీట్లు కూడా భారీగా గెలిచే సత్తా వైసీపీ ఉండడంతో.. కేంద్రంలోనూ హెల్ప్ అవుతుంది. ఎటు పోయి నష్టం అంటే.. ఫ్యాన్‌ పార్టీకే ! బీజేపీతో కలిస్తే జనంలో పార్టీ క్రెడిబిలిటీ మీద కొత్త చర్చ మొదలై మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.