CM Jagan: నలుగురు కాదు 16మంది ఎమ్మెల్యేలు..టీడీపీ మైండ్‌గేమ్‌తో జగన్‌కు ఝలక్‌

దేశ రాజకీయాలందు.. ఏపీ వేరయా అంటారు.. పాలిటిక్స్ తెలిసివాళ్లు అంతా ! నిజమే కూడా ! ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తుంటాయ్ అక్కడి పరిణామాలు. ఏపీ రాజకీయం రేంజ్ ఏంటో.. ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పకనే చెప్పాయ్. మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్న టీడీపీ.. బలం లేకున్నా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నెగ్గి.. వైసీపీ బలం మీద దెబ్బకొట్టింది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ కన్ఫ్యూజన్‌లో పడింది.  రెక్కలన్నీ తలో దిక్కు అన్నట్లుగా మారిపోయాయ్. వెన్నుపోటు పొడిచింది ఎవరు.. పొడవబోయేది ఎవరు అనే చర్చలో.. అసలు విషయం మర్చిపోతున్నారు వైసీపీ నేతలు !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2023 | 02:00 PMLast Updated on: Mar 24, 2023 | 2:00 PM

Cm Jagan Party In Deffence

ఇంత జరుగుతున్నా.. పార్టీ వీక్ అవుతున్నా.. ఆరు గెలిచిన తామే గ్రేట్ అని.. ఒక్కటి గెలిచిన టీడీపీ సంబరాలు చేసుకోవడం ఏంటి అంటూ మాజీ మంత్రులు, నేతలు కామెంట్లు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. వైసీపీ ఎలాంటి ట్రాన్స్‌లోకి వెళ్లిపోయింది అని ! ఇదంతా ఎలా ఉన్నా.. ఇకపై రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వైనాట్‌ 175 అంటూ జగన్‌ తాడేపల్లికే పరిమితం అవుతుంటే.. చంద్రబాబు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. జరగాల్సిన రాజకీయం జరిపించేస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి ఆరా తీస్తున్నారు.

కట్‌ చేస్తే.. ఆ కష్టానికి ఫలితమే.. ఎమ్మెల్సీ రిజల్స్ట్ ! టీడీపీ మీద వైసీపీ పొలిటికల్‌ గేమ్ ఆడుతుంటే.. వైసీపీ మీద టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇన్నాళ్లు టీడీపీకి వైసీపీ చూపించిన చుక్కలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు పని అయిపోయింది. సైకిల్ పార్టీ ఇక స్టోర్‌రూమ్‌కే అనే అభిప్రాయాలు వినిపించాయ్. అలాంటిది ఒక్కసారిగా పసుపు పార్టీ గెయిన్ అయింది. ఇదీ సార్ బలం.. ఇదీ సార్ చంద్రబాబు చాణక్యం అనే రేంజ్‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. వైసీపీకి రివర్స్‌లో చెక్ పెట్టే దిశగా టీడీపీ, చంద్రబాబు మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. ఇదంతా ఎలా ఉన్నా.. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి హ్యాండ్ ఇవ్వడంతో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో టీడీపీ విజయం సాధించింది. కోటంరెడ్డి, ఆనం బహిరంగంగానే వైసీపీతో విభేధించారు. ఐతే టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు ఎవరో తెలియాల్సి ఉంది.

టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినవాళ్లే సైకిల్ పార్టీకి ఓటేశారా.. వైసీపీలో సర్దుకోలేక జగన్ మీద కోపంతోనే కొందరు టీడీపీ వైపు మద్దతుగా నిల్చున్నారా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఏపీ రాజకీయాల్లో ఇకపై కీలక పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయం అనే చ్చ జరుగుతోంది. ఇద్దరు వైసీపీని వీడారు.. వ్యతిరేకంగా ఓటేశారు అంటే తెలియని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి దూరం అయినట్లే ! ఐతే ఈ నలుగురు మాత్రమే కాదు.. తమత టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉందని టీడీపీ నేతలు పదేపదే చెప్తున్నారు. వైసీపీలో ఉన్న 16మందికి పైగా ఎమ్మెల్యేలు తమవారే అంటూ టీడీపీ మైండ్‌ గేమ్ మొదలుపెట్టింది. ఎమ్మెల్సీలు కోల్పోయి బాధలో ఉన్న వైసీపీకి.. టీడీపీ మైండ్‌గేమ్ మరింత ఇబ్బందిగా మారింది. ఐతే ఇప్పటికైనా జగన్‌ తేరుకోవాలి.. పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. క్లీన్‌స్వీప్ మాయలోనే ఉంటే.. భారీ నష్టం తప్పదు అనే చర్చ వినిపిస్తోంది.