CM Jagan: యువ ఓటర్లే టార్గెట్‌గా బ్రహ్మాస్త్రం జగన్ స్పీడ్‌కు విపక్షాలు గల్లంతేనా ?
ఏపీ రాజకీయాలు కాక మీద కనిపిస్తున్నాయ్. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా.. రేపే పోలింగ్ అన్న రేంజ్‌లో మాటలు పేలుతున్నాయ్ ప్రధాన పార్టీల మధ్య ! క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా జగన్ అడుగులు వేస్తుంటే.. పులివెందులలోనే జగన్ ఓడిస్తామని ధీమాగా చెప్తున్నాయ్ టీడీపీ, జనసేన.
ఈ రెండు పార్టీల పొత్తు వ్యవహారం మరింత హాట్‌టాపిక్ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయ్. చంద్రబాబు ఇదేం ఖర్మ అంటూ జనాల్లోనే కనిపిస్తుంటే.. 14న వారాహిని బయటకు తీయబోతున్నారు పవన్. ఇక యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా.. లోకేశ్ యువగళం కొనసాగుతోంది. దీంతో ఈసారి ఎన్నికల యుద్ధం అంతకుమించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని జగన్ ధీమాగా కనిపిస్తున్నా.. మహిళలు, యువత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇదే ప్రత్యర్థి పార్టీకి ఆయుధంగా మారుతోంది.
మహానాడులో టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో చూస్తే అర్థం అవుతోంది కూడా ఇదే ! మహిళలను, నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ వరాలు గుప్పించారు చంద్రబాబు. నిజానికి ఏపీ రాజకీయాల్లో యువత ఓటు బ్యాంక్ చాలా కీలకం. గంపగుత్తగా వాళ్లంతా వైసీపీ వైపు వెళ్లడంతోనే.. జగన్ పార్టీ రికార్డు మెజారిటీ విజయం సాధించింది. యూత్‌ను ఆకట్టుకునేందుకు టీడీపీ ఎన్నిప్రయత్నాలు చేసినా.. వాళ్లంతా వైసీపీ వైపే ఉన్నారు. యువత ఓటర్లు చాలా కీలకం. వాళ్లే కాదు.. వాళ్లతో పాటు మరో పది మందిని కూడా మార్చి.. తాము అనుకున్న వాళ్లకు ఓట్లు వేయించగలరు.
నాలుగేళ్లలో ఏపీలో పరిస్థితి మారిపోయింది. ఉద్యోగాలు, పెట్టుబడుల విషయంలో జగన్ సర్కార్ తీరుపై మధ్య తరగతి యువతలో వ్యతిరేకత మొదలైంది. దీనికి బ్రేక్ చెప్పేలా.. యువత మనసు గెలిచేలా జగన్ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ల మనసు గెలిచేలా కీలక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఎన్నికల ముందు ఏడాదే రాజకీయంలో చాలా కీలకం. జగన్ కూడా ఇప్పుడు అదే ఫాలో కాబోతున్నారు. యువత మనసు గెలుచుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అందుకోవడంలో వైసీపీ ఫెయిల్ అవుతోంది. ఇది కూడా వైసీపీకి కలిసి వచ్చే చాన్స్ ఉంది. యువతతో పాటు మహిళలను కూడా ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ జగన్ నుంచి త్వరలో కీలక నిర్ణయం రాబోతోందని తెలుస్తోంది.