కేసీఆర్ కు బీహార్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన బిజెపి, ఆ సీఎం కంట్రోల్ చేయడానికా…?

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని, కనీసం ఇలా జరుగుతుందని కల కూడా కనలెం. పాతికేళ్ళ వయసు ఉన్న భారత రాష్ట్ర సమితి... బిజెపిలో కలిసిపోయే సమయం చాలా దగ్గరలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 11:51 AMLast Updated on: Aug 19, 2024 | 11:51 AM

Cm Kcr As Governer For Bihar

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని, కనీసం ఇలా జరుగుతుందని కల కూడా కనలెం. పాతికేళ్ళ వయసు ఉన్న భారత రాష్ట్ర సమితి… బిజెపిలో కలిసిపోయే సమయం చాలా దగ్గరలో ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే అక్షరాలా నిజం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక్క కుంభకోణం ఆ పార్టీ జెండా లేకుండా తుడిచిపెట్టేసిందని కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఆ కుంభకోణం ఇప్పుడు కేసీఆర్ ను రాజకీయాల నుంచి కూడా పంపించేస్తుంది… రాజకీయాలకు సంబంధం లేని రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చోబెడుతుంది. దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరిగిందని కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది అంతే అనేది వారి మాట.

కవితకు బెయిల్ రావాలంటే బీఆర్ఎస్ కచ్చితంగా కమలం పార్టీలో కలవాల్సిందే. రాజ్యసభలో ఎంపీలను బిజెపిలో కలపాల్సిందే అంటున్నారు. అందుకోసం సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు… కేటిఆర్ కు కేంద్ర మంత్రి పదవి వస్తే, హరీష్ రావును ప్రతిపక్ష నేత చేస్తే… కేసీఆర్ ను గవర్నర్ ను చేస్తారు. ఆ గవర్నర్ పదవి ఇప్పుడు కేసీఆర్ కు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఆయన్ను పంపించేది బీహార్… బీహార్ పంపడానికి బలమైన కారణం ఉంది. ఎన్డియేలో భాగస్వామి అయినా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదని బిజెపి భావిస్తోందట.

అన్నేళ్ల పదవీ అనుభవం ఉన్నా కూడా… నీకు ఇక్కడ లాభం జరుగుతుందని ఎవరైనా చెప్తే వాళ్ళ మాట నమ్మేస్తూ ఉంటారట ఆయన. గతంలో బిజెపికి గుడ్ బై చెప్పి ఆర్జెడితో ప్రభుత్వ ఏర్పాటు వెనుక జరిగింది అదే. అందుకే ఇప్పుడు నితీష్ ను కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ అవసరం ఉంది బిజెపికి. హిందీ చాలా అనర్గళంగా మాట్లాడగలిగే కేసీఆర్… రాజకీయ చతురతలో ఆరితేరిపోయారు. అందుకే ఆయన్ను బీహార్ పంపిస్తే తమకు రాజకీయంగా బలంగా ఉంటుందని కమలం పార్టీ స్కెచ్ వేసింది అని పరిశీలకులు అంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ అనుకున్నా… చంద్రబాబుతో వచ్చిన సమస్య ఏం లేదని… కాని నితీష్ తో వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి. ఒకవైపు మమత, మరో వైపు హేమంత్ సోరెన్ ఇలా కొందరు ఇండియా కూటమి నేతలు ఉన్నారు. వాళ్ళు నితీష్ ను తమ వైపుకి మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తిప్పుకుంటారు అనే భయం బిజెపిలో ఉందట. అందుకే ఇప్పుడు కేసీఆర్ కు బీహార్ ఫ్లైట్ బుక్ చేస్తుంది బిజెపి అధిష్టానం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.