CM KCR: కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్‌..!

ప్రత్యర్థి ఊహకి కూడా అందని వ్యూహాలు సిద్ధం చేయడంలో కేసీఆర్‌ దిట్ట. రాబోయే ఆరు నెలలను ముందే ఊహించి.. ఆ ప్రయాణం ఇప్పటి నుంచే మొదలుపెడతారు కేసీఆర్. గులాబీ బాస్‌ మార్క్ రాజకీయం ఏంటో.. తెలంగాణకు మరోసారి పరిచయం అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 15, 2023 | 08:10 PMLast Updated on: Sep 15, 2023 | 8:10 PM

Cm Kcr Gives Shock To Congress With New Scheme

CM KCR: కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.. కేసీఆర్‌కు పక్కాగా సరిపోయే మాట ఇది. ఆయన పాదాల సైజు చిన్నది కావొచ్చు. కానీ, వేసే అడుగులను అందుకోవడం అంత ఈజీ కాదు. ప్రత్యర్థి ఊహకి కూడా అందని వ్యూహాలు సిద్ధం చేయడంలో దిట్ట. రాబోయే ఆరు నెలలను ముందే ఊహించి.. ఆ ప్రయాణం ఇప్పటి నుంచే మొదలుపెడతారు కేసీఆర్. గులాబీ బాస్‌ మార్క్ రాజకీయం ఏంటో.. తెలంగాణకు మరోసారి పరిచయం అయింది. రాష్ట్రంలో ఎన్నికల మూడ్ మొదలైంది. బీజేపీ సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య యుద్ధం పీక్స్‌కు చేరింది.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. కాంగ్రెస్‌ జోరుకు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ రూపమే మారిపోయింది. కాంగ్రెస్‌లో ఎక్కడ లేని జోష్‌ కనిపిస్తోంది. ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే.. అధికారం వరకు వెళ్లొచ్చన్నది హస్తం పార్టీ పెద్దల ప్లాన్. దీనికోసం కర్ణాటక మోడల్‌ను ఫాలో కావాలని ఫిక్స్ అయ్యారు. కర్ణాటకలో బీజేపీని ఓడించిన పంచతంత్రాన్ని.. తెలంగాణలో బీఆర్ఎస్‌పై ప్రయోగించాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఐదు ప్రధాన హామీల పత్రాన్ని విడుదల చేయించాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.

మహిళలకు 500 రూపాయలకే సిలిండర్‌తో పాటు.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, యువతకు ఉద్యోగాల భర్తీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పునరుద్దరణతోపాటు.. బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు హామీలు ఇవ్వాలని కాంగ్రెస్ సిద్ధమైంది. హైదరాబాద్‌ వేదికగా సీడబ్ల్యూసీ మీటింగ్‌లో దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. సీడబ్ల్యూసీ సమావేశాలకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ ఇచ్చారు కేసీఆర్‌. కీలక పథకం ప్రకటించారు. స్కూళ్లలో అల్పాహారం పథకాన్ని తీసుకువచ్చారు. స్కూల్‌ విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు టిఫిన్ అందించబోతున్నారు. ఎన్నికల వేళ ఈ పథకం కీలకం కానుంది. ఇది బీఆర్ఎస్‌కు మైలైజ్ తీసుకురావడం, కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేయడం కూడా ఖాయం అనే చర్చ జరుగుతోంది.