Politics: రాహూల్ ఎపిసోడ్ పై కేసీఆర్ వ్యూహం ఫలించేనా..?

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సెంట్రల్‌ గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా అపోజిషన్‌ పార్టీలన్నీ సింగిల్‌ లైన్‌ ఫామ్ చేస్తున్నాయి. బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 11:30 PMLast Updated on: Mar 25, 2023 | 11:30 PM

Cm Kcr Stratagy Will Work Out

ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌ను తెలంగాణలో వచ్చే ఎన్నికల కోసం వాడుకోవాలనుకుంటున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. తెలంగాణలో నెమ్మదిగా పట్టు కోల్పోతున్న బీఆర్‌ఎస్‌ను.. మళ్లీ గాడిలో పెట్టేందుకు కాయిన్స్‌ మూవ్‌ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ హ్యాట్రిక్‌ కోసం ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్‌ మునుపటిలా లేదు. కాంగ్రెస్‌ పెద్దగా ఎఫెక్ట్‌ చూపకపోయినా.. బీజేపీ మాత్రం ఫుల్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రోజుకో కొత్త పార్టీ పుట్టుకోస్తోంది. ఈ స్పీడ్‌ను కంట్రోల్‌ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం కష్టం.

ఈ టాస్క్‌ను ఫేస్‌ చేసేందుకు రాహుల్‌ గాంధీ ఎపిసోన్‌ను ఆయుధంగా చేసుకోనున్నారట కేసీఆర్‌. నిజానికి ఇప్పుడున్న పరిస్థితి కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగానే ఉంది. రాహుల్‌ ఎప్పుడో చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పిటిషన్‌ వేయడం. సూరత్‌ కోర్ట్‌ రెండేళ్లు జైలుశిక్ష వేయడం. అప్పీల్‌కు టైం ఉండగానే లోక్‌సభ కేబినేట్‌ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడం.. ఇవన్నీ రాహుల్‌పై సింపతీ పెంచేలానే ఉన్నాయి.

ఇప్పుడు ఇదే మ్యాటర్‌లో బీజేపీని బూచిగా చూపే ప్లాన్‌లో గులాబీ బాస్‌ ఉన్నట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీ మీద వ్యతిరేకతను క్రియేట్‌ చేసి.. ఆ రిజల్ట్‌ను స్టేట్‌లో వాడుకోగలిగితే నెక్ట్స్‌ ఎలక్షన్స్‌లో కూడా బీఆర్‌ఎస్‌దే అధికారం. ప్రస్తుతం లిక్కర్‌ స్కాం కారణంగా ఫోకస్‌ మొత్తం కేసీఆర్‌ ఫ్యామిలీపైనే ఉంది. ఈ ఇష్యూతో లిక్కర్‌ స్కాంను కూడా డైవర్ట్‌ చేయవచ్చు. ఇప్పుడు ఇదే ప్లాన్‌ ఎగ్జిక్యూట్‌ చేసే పనిలో ఉన్నారు కేసీఆర్‌. దేశంలో ఉన్న అన్ని అపోజిషన్‌ పార్టీలను ఏకం చేస్తున్నారు. బీజీపీకి వ్యతిరేకంగా గట్టి వాయిస్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు. ఈ పనిలో సక్సెస్‌ అయితే మరోసారి టీఎస్‌ సర్కారును బీఆర్‌ఎస్‌ ఫామ్‌ చేయడం పక్కా.