CM KCR: కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్‌ సూపర్‌ ప్లాన్‌..

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని అన్ని రకాల ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 115మంది అభ్యర్థులను ప్రకటించారు. దీని వెనక కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉందనిపిస్తోంది. ఇక అటు తన పార్టీ బలం కంటే ఎక్కువ.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై దృష్టి సారిస్తారు కేసీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2023 | 02:13 PMLast Updated on: Sep 25, 2023 | 2:13 PM

Cm Kcr Targets Congress With A Master Plan

CM KCR: ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. లవ్‌, వార్ మాత్రమే కాదు.. పాలిటిక్స్ కూడా! ప్రతీ రాజకీయంలో యుద్ధం ఉంటుంది.. రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. ఇది మాత్రం క్లియర్. రాజకీయం ఇలానే చేయాలని రూల్ లేదు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వెళ్లడమే! ప్రత్యర్థిని దెబ్బతీసే అస్త్రాలు సంధించడమే. ఈ విషయం కేసీఆర్‌కు తెలిసినట్లు మరెవరికీ తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజకీయాన్ని శ్వాసించే పర్సనాలిటి కేసీఆర్.

ప్రత్యేక రాష్ట్ర కల సాకారం అయిందన్నా.. వరుసగా రెండుసార్లు కారు పార్టీ అధికారంలోకి వచ్చిందన్నా.. అదే కారణం. ఐతే తెలంగాణలో ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా కీలకం కాబోతున్నాయ్. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంటే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో రెండుసార్లు ఫెయిల్ అయిన కాంగ్రెస్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఫిక్స్ అయింది. అందుకే ఢిల్లీలో మాత్రమే కనిపించే కొందరు నాయకులు.. ఇప్పుడు తెలంగాణ గల్లీల్లోనూ ల్యాండ్ అవుతున్నారు. కాంగ్రెస్ స్ట్రాటజీల సంగతి ఎలా ఉన్నా.. హస్తం పార్టీని దెబ్బతీసేందుకు కేసీఆర్ సూపర్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని అన్ని రకాల ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 115మంది అభ్యర్థులను ప్రకటించారు. దీని వెనక కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉందనిపిస్తోంది. ఇక అటు తన పార్టీ బలం కంటే ఎక్కువ.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై దృష్టి సారిస్తారు కేసీఆర్. ఈసారి కూడా అదే వ్యూహంతో పాచికలు వేశారు.

ఐతే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ప్రకటన తర్వాత విపరీతమైన రెబల్స్ ఉంటారు. ఆ పార్టీలో ఉన్న రెబల్స్‌ను.. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించే ప్రక్రియ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా భంగపడే నేతలను గుర్తించినట్టు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌లో టికెట్ రాకుంటే.. అందులో భంగపడ్డ బలమైన నేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి.. తన ప్లాన్ అమలు చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రెబల్స్‌ను పార్టీలోకి ఆహ్వానించి.. కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించి.. జనాల దగ్గర హస్తం పార్టీ బలహీనతలను బయటపెట్టే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ముల్లును ముల్లుతోనే తీయడం, వజ్రాన్ని వజ్రంతోనే కోయడంలాంటి కాన్సెప్ట్ అన్నమాట. కేసీఆర్ ప్లాన్ తెలిసే.. అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ స్లోగా ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది.