CM kcr: ప్రొ.హరగోపాల్ మీద కేసు తీసేయండి.. డీజీపీ మీద సీఎం కేసీఆర్ సీరియస్..
ప్రొఫెసర్ హరగోపాల్ మీద నమోదైన ఉపా కేసును వెంటనే తీసి వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. ఈ కేసు విషయంలో ఆయన డీజీపీని మందలించినట్టు సమాచారం. రెండు రోజుల నుంచి ఈ కేసు తెలంగాణలో చర్చనీయాంశమైంది.
కేవలం హరగోపాల్ మీదే కాదు.. మొత్తం 152 ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలపై ఉపా కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై ప్రొఫెసర్ హరగోపాల్ సీరియస్ అయ్యారు. ఉద్యమకారులను అణచివేసేందుకు ఇలాంటి చట్టాలను ఉపయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కేవలం పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ కేసు నమోదైందని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది పార్టీని అన్నట్టు కాదన్న విషయం పోలీసులు తెలుసుకోవాలని సీరియస్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమాల నుంచి అలాంటి ఉద్యమకారులను అణచివేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందిచాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో పాటు 152 మందిపై పెట్టిన ఉపా కేసును వెంటనే తీసి వేయాలని డిమాండ్ చేశారు. హరగోపాల్ డిమాండ్ చేసినట్టుగానే ఈ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. డీజీపీతో మాట్లాడి కేసు పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. హరగోపాల్‌తో పాటు 152 మంది విద్యార్థి నేతలు, సామాజిక కార్యకర్తలపై పెట్టిన కేసును వెంటనే తీసివేయాలంటూ ఆదేశించారు.