CM Kcr: కేసీఆర్ సలహాదారుగా జర్నలిస్ట్ రాహుల్ !?
సీఎంను ఎవరూ అడగని, అడగలేని సాహసోపేతమైన ప్రశ్నలను రాహుల్ మాత్రమే అడుగుతారు. రాహుల్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్‌కు వచ్చే ఇరిటేషన్ అంతా ఇంతా కాదు. అయినా సీఎం రాహుల్‌ను ఏమీ అనరు. "ఇది మంచిగ లేదా రాహుల్" అంటూ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు మాట్లాడతారు.
CM Kcr: సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ జరుగుతోందంటే చాలు.. అక్కడ జర్నలిస్ట్ రాహుల్ ఉండాల్సిందే. సీఎంను ఎవరూ అడగని, అడగలేని సాహసోపేతమైన ప్రశ్నలను రాహుల్ మాత్రమే అడుగుతారు. రాహుల్ అడిగే ప్రశ్నలకు కేసీఆర్‌కు వచ్చే ఇరిటేషన్ అంతా ఇంతా కాదు. అయినా సీఎం రాహుల్‌ను ఏమీ అనరు.
“ఇది మంచిగ లేదా రాహుల్” అంటూ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఓ నేషనల్ న్యూస్ పేపర్‌కు ఎడిటర్‌గా పని చేసిన రాహుల్.. ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఇక నుంచి సీఎం ప్రెస్ మీట్లకు రాహుల్ వెళ్లరు. రాహుల్ అనే పేరు ప్రెస్‌మీట్‌లో వినిపించదు. అయితే జర్నలిస్ట్‌గా రిటైర్ ఐన తరువాత రాహుల్‌కు కీలక పదవి కట్టబెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాహుల్‌ను తన సలహాదారుగా నియమించే ఆలోచనలో ఉన్నారట సీఎం కేసీఆర్. రాహుల్ కేవలం కేసీఆర్‌కు మాత్రమే కాదు. గతంలో పని చేసిన చాలా మంది ముఖ్యమంత్రులకు చాలా క్లోజ్. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, రాహుల్ క్లాస్ మేట్స్. సీఎం కేసీఆర్‌కు కూడా ఉద్యమ సమయం నుంచి రాహుల్ చాలా క్లోజ్. ఓసారి సీఎం కాన్వాయ్ వెళ్తుండగా రోడ్ మీద రాహుల్ కనిపిస్తే కేసీఆర్ కాన్వాయ్ ఆపి మరీ రాహుల్‌ను కారులో ఎక్కించుకున్నారు. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్‌గా నడిచింది.
సీఎంతో సాన్నిహిత్యం మాత్రమే కాదు.. సీనియర్ జర్నలిస్ట్‌గా రాహుల్‌కు తెలంగాణ మీద మంచి పట్టు ఉంది. గ్రౌండ్ స్థాయిలో రాజకీయాలు, ప్రజా సమస్యల మీద మంచి అవగాహన ఉంది. ఈ కారణంగానే రాహుల్‌ను సలహాదారుగా నియమిస్తే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్, సాహిత్యకారుడు టంకశాల అశోక్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు కేసీఆర్. ఇప్పుడు రాహుల్‌ను కూడా అలానే నియమించే చాన్స్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.