బ్రేకింగ్: కేటిఆర్ కంటే జగన్ బెటర్, రేవంత్ హాట్ కామెంట్స్
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి... వరద ముప్పుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, నష్ట పరిహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించిన అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి… వరద ముప్పుని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, నష్ట పరిహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పై సిఎం విమర్శల వర్షం కురిపించారు.
పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ కనీసం ప్రజలపై జాలి కూడా చూపడం లేదని మండిపడ్డారు. కేటిఆర్ ఎక్కడో అమెరికాలో ఉండి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్ళారని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయమని తాను అడగడం లేదని కాని బాధ్యతగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత ప్రజల్లో తిరుగుతుంటే కేటిఆర్ అమెరికాలో ఉండి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం గురించి ఏం మాట్లాడటం లేదన్నారు రేవంత్. దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. కేంద్రం నష్టాలను అర్ధం చేసుకుని సహాయం చేయాలని కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఎవరో రాసే పిచ్చి రాతల గురించి మంత్రులు పట్టించుకోవద్దని మంత్రులు బాగా పని చేసారని అన్నారు. అధికారులకు సెలవలు రద్దు చేసామన్నారు.
ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం నివారించడానికి కష్టపడుతున్నామని అన్నారు. తాను ఖమ్మం లోనే ఉండి రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తా అన్నారు. ఇలాంటి విపత్తుని గతంలో ఎన్నడూ చూడలేదన్న ఆయన… వరద బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని రేవంత్ హెచ్చరించారు. ఎపీలోని కృష్ణా జిల్లా కంటే… ఖమ్మం జిల్లాకు ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేసారు.