Congress Guarantees: 27 నుంచే ఆ రెండు హామీలు.. ఉచిత కరెంట్, 500కి సిలెండర్ !
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అప్లయ్ చేసింది. ఇందులో మహిళల బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయింది.
Congress Guarantees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు హామీలను అమలు చేయబోతుంది. ఎంతో పాపులర్ అయిన ఉచిత విద్యుత్, మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకాలను ఈనెల 27 నుంచి అమలు చేయనుంది. మేడారంలో వనదేవతల దర్శనానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని తెలిపారు.
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అప్లయ్ చేసింది. ఇందులో మహిళల బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయింది. జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రాయితీ ఇచ్చినందుకు ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతి నెలా రిఫండ్ చేస్తోంది. ఈ నెల 27 నుంచి మహిళలకు 500లకే గ్యాస్ సిలెండర్ ఇవ్వబోతోంది. అలాగే మార్చి 1 నుంచి అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేయబోతోంది. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని సీఎం రేవంత్ ప్రకటించారు.
మేడారంలో వనదేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు. గతంలో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలను మేడారం నుంచే ప్రారంభించినట్టు తెలిపారు. మేడారం జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా 110 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.