నన్ను చూస్తే కడుపు మండుతుంది: రేవంత్ సంచలనం
అధాని ప్రధాని అనుబంధం దేశ ప్రతిష్టను భంగం కలిగించాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజ్ భవన్ వద్ద నిరసన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... విదేశాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న బిన్నం చేసే కుట్రకు దారి తీశారని ఆరోపించారు.

అధాని ప్రధాని అనుబంధం దేశ ప్రతిష్టను భంగం కలిగించాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజ్ భవన్ వద్ద నిరసన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… విదేశాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న బిన్నం చేసే కుట్రకు దారి తీశారని ఆరోపించారు. లంచం ఇస్తేనే విదేశాల్లో పనులు జరుగుతాయి అన్నట్టు అధాని ఉదంతం తెరమీదకు వచ్చిందన్నారు. అధాని అంశంలో జేపీసీ లో చర్చ జరగాలని డిమాండ్ చేసారు. ప్రధాని నిమ్మకు నీరెంతు నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.
రాహుల్ గాంధి దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారని రాజ్ భవన్ కూత వేటు దూరంలో పోలీసులు మమ్మలి అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన నిరసన తెలిపామని అన్నారు. మేము చేసే నిరసనల వల్ల కొంత మంది కడుపు నొచొచ్చన్నారు. రాహుల్ గాంధి అన్నట్టు జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం లో ఉండి కాంగ్రెస్ ధర్నా చేయడం ఏంటి అని కొంత మంది అనొచ్చని వ్యాఖ్యానించారు రేవంత్.
అదానీపై కేసీఆర్, బీఆరెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు. వారి వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీతో బీఆరెస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఆదానీపై వారు స్పందించడం లేదని అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీఆరెస్ బీజేపీకి లొంగిపోయిందని ఆరోపించారు. అందుకే ఆదానీపై బీఆరెస్ మాట్లాడటంలేదని పార్లమెంట్ లో బీఆరెస్ విధానం ఏమిటో చెప్పాలన్నారు. మీరు ప్రజల వైపా.. అదానీ వైపా.. చెప్పాలని డిమాండ్ చేశారు.