కలెక్టర్లు క్షేత్రస్తాయికి వెళ్లి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందన్నారు సీఎం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లే అన్నారు సీఎం. కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానమని కొనియాడారు. కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామన్న సీఎం.. కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారని సమస్యలు వచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారని అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దు అని తేల్చి చెప్పారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందే అన్నారు సీఎం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలని ఆదేశించారు. [embed]https://www.youtube.com/watch?v=irwnnn9kjWA[/embed]