CM REVANTH REDDY: యశోద హాస్పిటల్‌లో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
ప్రజాభవన్‌లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద హాస్పిటల్ దగ్గర భద్రత పెంచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
CM REVANTH REDDY: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్‌లో బాత్ రూంకు వెళ్తున్న సమయంలో కేసీఆర్ కాలుజారి పడిపోయినట్టు ఆయన సిబ్బంది చెప్తున్నారు. కాలు తొంటికి తీవ్ర గాయం అవ్వడంతో వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రైమరీ చెకప్స్ చేసిన డాక్టర్లు.. కేసీఆర్‌కు తొంటి ఎముక విరిగినట్టు నిర్ధారించారు. విరిగిన భాగంలో ఆపరేషన్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
PRAJA DARBHAR: ప్రజాదర్బార్.. పదేళ్ల తర్వాత ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ.. పోటెత్తిన బాధితులు
మరిన్ని టెస్ట్‌లు చేసిన తరువాత ఆపరేషన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని చెప్తామన్నారు. ఇదే సమయంలో ప్రజాభవన్‌లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద హాస్పిటల్ దగ్గర భద్రత పెంచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఎలాంటి సమస్య లేకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం యశోద హాస్పిటల్‌కు సెక్యూరిటీ పెంచారు
పోలీసులు. మరోపక్క కేసీఆర్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు యశోద హాస్పిటల్‌కు వస్తున్నారు. కేసీఆర్‌కు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు.