CM REVANTH REDDY: హాస్పిటల్‌లో కేసీఆర్‌.. వైరల్‌ అవుతున్న సీఎం రేవంత్‌ ట్వీట్

సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ విషయంలో వెంటనే స్పందించారు. హెల్త్‌ సెక్రెటరీని ఉన్నతాధికారులను వెంటనే హాస్పిటల్‌కు పంపించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 01:55 PMLast Updated on: Dec 08, 2023 | 3:02 PM

Cm Revanth Reddy Tweeted About Kcr Health

CM REVANTH REDDY: రాజకీయంగా రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ ఎంతటి శత్రువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. చివరికి అన్నంత పనీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తెలంగాణకు రెండో సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ అలాంటి రేవంత్‌ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌ ఆరోగ్యం విషయంలో చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారు.

PRAJA DARBHAR: ప్రజాదర్బార్.. పదేళ్ల తర్వాత ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ.. పోటెత్తిన బాధితులు

బాత్ రూంకు వెళ్తున్న సమయంలో కింద పడటంతో ఆయన ఎడమ తొంటికి తీవ్ర గాయమైంది. బోన్‌ డిస్‌లొకేట్‌ అవ్వడంతో ఆయనకు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు సూచించారు. కొన్ని మెడికల్‌ టెస్ట్‌లు కంప్లీట్‌ చేసిన తరువాత సర్జరీ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ రియాక్ట్‌ అయిన తీరు అందరిలో ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. కేసీఆర్‌ ప్రమాదానికి గురైన వెంటనే గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఆయనను యశోద హాస్పిటల్‌కు తరలించారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఈ విషయంలో వెంటనే స్పందించారు. హెల్త్‌ సెక్రెటరీని ఉన్నతాధికారులను వెంటనే హాస్పిటల్‌కు పంపించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలంటూ ఆదేశించారు. యశోద హాస్పిటల్‌ దగ్గర భద్రత పెంచాలంటూ పోలీసులను కూడా ఆదేశించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు.

“మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు సీఎం రేవంత్‌. రాజకీయ శత్రువైన కేసీఆర్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి ఇంత ఇంట్రెస్ట్‌ చూపించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.