దుమ్ము రేపాలి, మంత్రులకు రేవంత్ ఆదేశాలు
శుక్రవారం మధ్యహ్నం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నాలుగు పథకాలు ఈనెల 26న అట్టహాసంగా ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం మధ్యహ్నం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నాలుగు పథకాలు ఈనెల 26న అట్టహాసంగా ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో.. గణతంత్ర వేడుకలు పురస్కరించుకొని సంక్షేమ పథకాలు అందజేతకు ప్లాన్ చేసింది సర్కార్.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సర్వం సిద్ధం చేసారు. ప్రోగ్రాం సక్సెస్ చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుండి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు కూడా వెళ్ళాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్ లు ఆధ్వర్యంలో నాలుగు పథకాల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పే విధంగా నేతల ప్రసంగాలు ఉండనున్నాయి.