ఏపీలో కూటమి నేతల అడ్డగోలు దోపిడీ ,బరితెగించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
2024 ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వంపై కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. వైసీపీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ప్రచారం చేశారు. ఇసుక, మద్యంలో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు.

2024 ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వంపై కూటమి నేతలు దుమ్మెత్తిపోశారు. వైసీపీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ప్రచారం చేశారు. ఇసుక, మద్యంలో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరగని అవినీతి లేదంటూ నానా హంగామా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేంటి ? ఎన్డీయే ఎమ్మెల్యేలు కంటికి కనిపించిన ప్రతిదాన్ని…మాయం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు వసూళ్లకు పాల్పడుతున్నారు. కాదుకూడదని చెప్పినా….కప్పం కట్టం తీరాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా…నేతలు మాత్రం అంతా మా ఇష్టం అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దొరికింది దోచుకోవడం లక్ష్యంగా పని చేస్తున్నారు. కొందరు సైలెంట్ గా సహజ వనరులను దోచుకుంటున్నారు. ఇంకొందరు ఇష్టారాజ్యంగా సంపాదించుకోవడానికే గెలిచామన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే సీన్. ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తున్నా…ప్రజాప్రతినిధులు మాత్రం అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు…అనేలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు. కూటమిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు…అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎవరేమనుకుంటే నాకేంటి…అనేలా అవినీతిలో ఆరితేరిపోయారు. వైసీపీ సాగనంపి టీడీపీ, జనసేన, బీజేపీని తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తుంటే…గ్రౌండ్ లెవల్ మరొకటి జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డే లేకుండా పోతోంది. సంపాదించడానికే గెలిచామన్నట్లు పెట్రేగిపోతున్నారు.
ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు…నియోజకవర్గానికి సామంతరాజుల వ్యవహరిస్తున్నాడు. ప్రతి పనిలో వాటాలు వసూలు చేస్తున్నాడు. చిన్న కాంట్రాక్టర్ల నుంచి రామాయపట్నం పోర్టు పనుల దాకా…మనోడికి కప్పం కట్టాల్సిందే. మాట వినకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లోనూ వైసీపీ హయాంలో అడ్డగోలుగా సాగింది. తాజాగా ఇప్పుడు అదే తరహా దందాకు తెర లేపారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశాడు. ఇంటూరి అడిగినట్లు వాటా ఇచ్చేందుకు , ఇతరత్రా కప్పం కట్టేందుకు కాంట్రాక్టు సంస్థ ఒప్పుకోలేదు. దీంతో కందుకూరు ఎమ్మెల్యే తన ప్రతాపం చూపడం మొదలెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్టు సంస్థను దారికి తెచ్చుకోవాలని భావించాడు.
నిర్మాణ పనుల కోసం కంకర, ఇసుక తెస్తున్న లారీలు తిరగకుండా అడ్డుకున్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా చేయడం ద్వారా…కాంట్రాక్టు సంస్థను దారికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. అక్కడితో ఆగని ఇంటూరి ఆరాచకత్వం…కంకర, ఇసుక తోలకం పనులను పూర్తిగా తనకే అప్పగించాలనే డిమాండ్లు పెట్టాడు. దీనికి ఆ సంస్థ అంగీకరించకపోవడంతో…ఒక్కో లారీ ట్రిప్పునకు…వెయ్యి రూపాయలు కప్పం కట్టాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు కానిస్టేబుళ్లను దగ్గర పెట్టుకుని…లారీలను రోడ్డు మీద అడ్డుకుంటున్నాడు. పోర్టు పనులు ముందుకు సాగకుండా నానా అరాచకం సృష్టిస్తున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే అరాచకత్వంపై పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
పోర్టు పనులకు ఆటంకాలు కలిగించవద్దని…అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంవో…ప్రకాశం జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సముద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రేక్‌వాటర్ పనులు పూర్తిచేయడంపై దృష్టి సారించింది. ఇక్కడ పనులు ప్రారంభంకాగానే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. పోర్టు నిర్మాణంపై సీఎంవో సీరియస్ కావడంతో…ఇంటూరి నాగేశ్వరరావు ఏం చేస్తారు ? నిర్మాణ సంస్థను అలాగే బెదిరిస్తారా ? లేదంటే వెనక్కి తగ్గుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనే అనుకుంటే…ఆయన అనుచరులు, బంధువులు తామేమీ తక్కువ కాదంటున్నారు. రేషన్ డీలర్లు, వీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను మార్చేస్తున్నారు. తమకు ఇష్టమొచ్చిన వారిని తెచ్చుకోవడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.