ALI YSRCP: వైసీపీ ప్రచారానికి అలీ డుమ్మా ! అసలేం జరిగింది ?
అప్పట్లో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించారు. కానీ దక్కలేదు. ఈ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్ల కోసం నటుడు అలీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఒకానొక దశలో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ అలీ కూడా నిలబడతారన్న టాక్ ఏపీలో నడిచింది.

ALI YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. అన్ని పార్టీల నేతలు యాత్రలతో బిజీగా ఉన్నారు. గతంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన నటుడు అలీ మాత్రం ఈసారి డుమ్మా కొట్టారు. 2019 ఎన్నికల్లో అలీ పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనుకున్నారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పోస్ట్ ఇచ్చారు సీఎం జగన్. అప్పట్లో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించారు. కానీ దక్కలేదు.
Anusuya vijay : విజయ్ బూతుపై అనసూయ స్పందన ఇదే..
ఈ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్ల కోసం నటుడు అలీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఒకానొక దశలో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ అలీ కూడా నిలబడతారన్న టాక్ ఏపీలో నడిచింది. కానీ పవన్ పిఠాపురం నుంచి దిగుతున్నా.. అలీకి మాత్రం టిక్కెట్ కన్ఫమ్ అవలేదు. హిందూపురం, నంద్యాల, గుంటూరు నియోజకవర్గాల్లో ఆయన్ని నిలబెడతారన్న టాక్ కొంతకాలం నడిచింది. ఆ తర్వాత నెల్లూరు, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాల్లోనూ అలీ పేరు వినిపించింది. కానీ ఎక్కడా కూడా అలీకి సీటు కన్ఫమ్ చేయలేదు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్. CMO నుంచి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాననీ.. జగన్ ఎక్కడ నిలబడమంటే అక్కడ నిల్చోవడానికి రెడీ అంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చినా వైసీపీ అధిష్టానం కనికరించలేదు. దాంతో వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అలీ సైలెంట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించట్లేదు.
అసలు అలీ వైసీపీలో ఉంటారా.. పార్టీ మారతారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. అలీ వర్గీయులు మాత్రం.. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులపై అసమ్మతి చెలరేగుతోంది. చివరి నిమిషంలో కొందరు అభ్యర్థులను మారుస్తారన్న టాక్ ఉంది. దాంతో నామినేషన్ల నాటికి అయినా అలీకి అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ అలీ మాత్రం ప్రస్తుతం సినిమాలు, టీవీ షోల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. అందుకే అలీ.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వస్తాడా రాడా అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ఇప్పటిదాకా సినిమాల్లో నటించిన అలీ.. పాలిటిక్స్‌లో సెకండ్ ఇన్నింగ్స్ చేద్దామనుకున్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యేట్టు కనిపించడం లేదు.