Top Story: థూ..మీ బతుకులు చెడ! ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని?

థూ...మీ బతుకులు చెడా! ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని? ఏ పెంట రాసి కొట్టాలిరా మిమ్మల్ని? మనిషి పుట్టుక ఎలా పుట్టార్రా అసలు మీరంతా... ఆగండాగండి ఇవి నేను అంటున్న మాటలు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 03:08 PMLast Updated on: Jan 07, 2025 | 3:08 PM

Common People Fire On Jc Prabhakar Reddy And Madhavi Latha

థూ…మీ బతుకులు చెడా! ఏ చెప్పుతో కొట్టాలిరా మిమ్మల్ని? ఏ పెంట రాసి కొట్టాలిరా మిమ్మల్ని? మనిషి పుట్టుక ఎలా పుట్టార్రా అసలు మీరంతా… ఆగండాగండి ఇవి నేను అంటున్న మాటలు, నేను తిడుతున్న తిట్లో కావు. కనీస మానవత్వం ఉన్న మనుషులు అంతా ఏకమై… తాడిపత్రి కింగ్ గా భావించుకునే జేసీ ప్రభాకరరెడ్డిని, ఏపి బిజేపీ లీడర్స్‌ను తిట్టిన తిట్లు తిట్లకుండా మరీ తిడుతున్నారు మనసున్న మనుషులు. పాత ఏడాదికి గుడ్‌ బై చెబుతూ కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పే సంబరాల సాక్షిగా మొదలైన ఈ వివాదం… సభ్య సమాజం తలదించుకునే విధంగా తయారైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి తాడిపత్రిలో జేసీ ప్రభాకరెడ్డి ఏర్పాటు చేసిన విమెన్ సెలబ్రేషన్స్ కు వ్యతిరేకంగా , సేఫ్టీ జాగ్రత్తలు చెబుతూ బిజేపీ నేత మాధవిలత రిలీజ్ చేసిన వీడియో, కౌంటర్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి విడుదల చేసిన వీడియో చూడకుంటే … ఎవరు ఎందుకు తిడుతున్నారో , ఇంత తక్కువగానే ఎందుకు తిడుతున్నారో, డోస్ పెంచి చెప్పు దెబ్బలు కానుకగా ఎందుకు ఇవ్వట్లేదో క్రిస్టల్ క్లియర్ గా అర్ధం అవుతుంది.

అధికారమదం నెత్తికెక్కితే, డబ్బు గర్వం నరనరాల్లోకి పాకితే… ఎలాంటి మాటలు వస్తాయో… తాను ఏర్పాటు చేసిన అర్ధరాత్రి పార్టీకి మహిళలను వెళ్లొద్దని చెప్పిందని, ఒకవేళ వెళ్లినా సరే అత్యంత జాగ్రత్తగా ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్పిందనే సాకుతో సినీనటి, బిజేపీ నేత మాధవిలతను… ప్రాస్టిట్యూట్ … తెలుగులో చెప్పాలంటే లంజ, వ్యభిచారి అంటూ తిట్టాడు జేసీ ప్రభాకరరెడ్డి. అంతే కాదు ఇంకా పచ్చిబూతులతో విరుచుకుపడ్డాడు. తీరా ఇదేదో మెడకు చుట్టుకుంటుంది అని తెలుసుకున్నాక సారీ ..ఆవేశంలో మాట జారాను తప్పేనంటూ బుకాయించాడు జేసీ ప్రభాకరరెడ్డి. వాహ్… ఆస్కార్ కూడా తలదించుకునే యాక్టింగ్ బాసు నీది! మిస్టర్ జేసీ ప్రభాకర రెడ్డి… హ్యాట్సాఫ్‌ టూ యువర్ యాక్టింగ్! ఏది మాట్లాడినా సరే , ఎలా రెచ్చిపోయినా సరే, ఎవడేం పీకుతాడు అనే ధైర్యమే ఇది. రాజకీయం నా ఇంట్లో పుట్టింది , నా అన్న మాజీ మంత్రి, నేను మున్సిపల్ ఛైర్మన్, నా కొడుకు ఎమ్మెల్యే… సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా సరే నా ఇంటి ముందుకు వచ్చి ఆగాల్సిందే. ఆగి సలామ్ కొట్టాల్సిందే అనే లెక్కలేని తనమే ఈ నోటి దూలకు నాంది. అందుకే కదా… ఒక ఆడపిల్లను పట్టుకుని అంత దారుణంగా అవమానించావు. పచ్చిబూతులు తిట్టడమే కాకుండా ఆవేశంలో టంగ్ స్లిప్ అయ్యాను అంటూ దబాయించావు, బుకాయించావు. తప్పు చేయడం సారీ చెప్పడం.. ఇప్పుడిదొక ఫ్యాషన్ అయిపోయింది. అంతే బల్సినోడికి బారా ఖూన్ మాఫ్!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు… కొడాలినాని, రోజా, బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, శ్రీరెడ్డి నోటికి అదుపు ఉండేది కాదు.. మాట్లాడితే బొచ్చు, బోకు, రాడ్డు, ఏం పీకారు, ఎవడేం పీకుతాడు …ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో కంపు మాటలు. నిండు అసెంబ్లీ సాక్షిగా నేటీ సీఎం చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరిని దారుణంగా అవమానించిన తీరు నేటికి సజీవమే. మంచి చెప్పినందుకు, జాగ్రత్తలు చెప్పినందుకు మాధవిలతను ప్రాస్టిట్యూట్ అన్న జేసీ ప్రభాకరరెడ్డి… నాడు పచ్చిబూతులతో విరుచుకుపడిన వైసీపీ నేతలందర్ని మంచివాళ్లను చేసేసాడు. ఛీ…వీడి కన్నా వాళ్లే బెటర్ అనే పొజిషన్ తీసుకొచ్చాడనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. అందుకే థూ..నీ బతుకు చెడా.. ఏ చెప్పుతో కొట్టాలిరా నిన్ను, సారీ చెబితే సరిపోతుందా అనే కామెంట్లు, పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి సర్కార్ తీరు, ఏపి బిజేపీ నేతల తీరు మరొక ఎత్తు. అసలు జేసీ ప్రభాకరరెడ్డి..మాధవిలతను అంత దారుణంగా తిట్టలేదు అనే కొంగజపం, దొంగజపం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. మేం అధికారంలోకి వస్తే కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ మహిళాలోకం తల ఎత్తుకుని బతుకుతుందని అవసరం లేని చోట కూడా చెప్పారు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారాలోకేష్. ఏపిలో కూటమి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత ఎన్ని అత్యాచారాలు, మరెన్ని హత్యాచారాలు జరిగాయో లెక్క ఓ వైపు భయపెడుతోంటే… ఇంత బరితెగించి మరీ టిడిపి నేత జేసీ … ఒక మహిళను ప్రాస్టిట్యూట్ అన్నా పట్టించుకోలేదంటే, బాధితురాలికి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు అందలేదంటే… ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కు ఇంత ద్వంద నీతి ఎందుకు అనేది సమాధానం తేలాల్సిన ప్రశ్న! ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ తిట్టింది బిజేపీ మహిళా నేతను కదా ..మన పార్టీ వాళ్లను కాదు కదా అని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటిస్తున్నారా… సీఎం,డిప్యూటీ సీఎంలే లైట్ తీసుకున్నప్పుడు నాకేం పని అని మినిస్టర్ నారా లోకేష్, హోం మినిస్టర్ అనితలు జానేదో యార్ అనుకున్నారా అనేది అత్యవసరంగా తేలాల్సిన మరో ప్రశ్న. అధికారంలోకి వచ్చేందుకు మహిళల భద్రతే మా ఆశయం అంటూ రొమ్ము విరుచుకు చెప్పిన ఘనాపాటి నేతలంతా అవసరం తీరాక మహిళలను ఎవడెలా తిడితే మనకేంటి? ఎవడు ఎన్ని రేప్స్ చేస్తే మాకేంటి? ఎవడెలా రెచ్చిపోతే మాకేంటి, పవర్ తో పాటు సూట్ కేసుల్లో వాటా దొరికితే చాలు… అనుకున్నారేమో అనుకుంటున్నారు సామాన్యులు. టూ ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మాధవిలత వర్సెస్ జేసీ ఎపిసోడ్ లో ప్రజాగ్రహానికి గురవుతున్న కీలక విషయం ఏపీ బిజేపీ అధిష్ఠానం మౌనం. పురంధేశ్వరి ఏపీ బిజేపీ చీఫ్‌ గా ఉండి కూడా… ఒక సాటి మహిళకు అండగా నిలబడక పోవటం, కనీసం ఖండించకపోవడం అత్యంత జుగుప్సను కలిగిస్తున్న అంశం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు… యత్ర నార్యంతు పూజ్యంతే.. రమన్తే తత్ర దేవతా అనే బిజేపీ నేతల శ్లోకాలు..సూక్తులు నీటిమీద రాతలే అని…. కూటమి ప్రయోజనాలే తప్పితే… సామాన్యుల రక్షణ,మహిళల శ్రేయస్సు…ఏపిలో కూటమికి అసలే మాత్రం అవసరం లేదని క్లియర్ కట్ గా అర్ధం అయిందటున్నారు ప్రజలు. అందుకే థూ..మీ బతుకులు చెడా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.