REVANTH REDDY: మంత్రి పదవులెన్ని..? పోటీ పడుతోంది ఎందరు..?
ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే, పోటీపడుతున్నవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. దీంతో వారందరికీ పదవులు కేటాయించడం రేవంత్‌కు, అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువ. సీఎం పదవి కోసమే పోటీ పడ్డారంటే.. ఇక మంత్రి పదవుల్ని వదిలిపెడతారా..?

Will Revanth Reddy become CM..? Bazaar of realtors and contractors..!
REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖాయం చేసింది అధిష్టానం. దీంతో ఆయన గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు రేవంత్‌కు పెద్ద సవాలుగా మారనుంది. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే, పోటీపడుతున్నవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంది. దీంతో వారందరికీ పదవులు కేటాయించడం రేవంత్‌కు, అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువ.
CM Revanth Reddy : రేవంత్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు! కేసీఆర్‌కు కూడా ఆహ్వానం.. వస్తారా ?
సీఎం పదవి కోసమే పోటీ పడ్డారంటే.. ఇక మంత్రి పదవుల్ని వదిలిపెడతారా..? ప్రధానంగా కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహా, సీతక్క, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి వంటి నేతలు పదవులు ఆశిస్తున్నారు. ఓడిపోయినప్పటికీ జీవన్ రెడ్డి కూడా పదవి ఆశిస్తున్నాడు. కాంగ్రెస్‌లో ఉన్న వారే కాకుండా ఇతరులకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉంది. కాంగ్రెస్‌కోసం త్యాగం చేసిన వాళ్లు, మద్దతు ఇచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. వారికి ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వంటి వారికి పదవి ఇవ్వాలి. అలాగే టిక్కెట్ దక్కకపోయినా పార్టీకి విధేయంగా ఉన్న అద్దంకి దయాకర్ లాంటి వారికి పదవి ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి పదవులు వస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
పదవులు దక్కని వాళ్లంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యే ఛాన్స్ ఉంది. అందరినీ బుజ్జగించి, ఒప్పించి, సామాజిక సమీకరణాలు, విధేయత, అనుభవం, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వడం కత్తిమీద సామే. మరి ఈ అంశాన్ని రేవంత్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.