KCR: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్‌.. కాంగ్రెస్‌లోకి నేతల జంప్

కాంగ్రెస్ బలం పెరిగేలా.. బీఆర్ఎస్‌ బలం మీద దెబ్బకొట్టేలా స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వరంగల్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2024 | 10:34 PMLast Updated on: Jan 03, 2024 | 10:34 PM

Congress Gives Big Shock To Brs In Warangal

KCR: అధికారం మారితే కనిపించే చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయ్‌. తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. మరోవైపు కారు పార్టీకి ఝలక్ ఇచ్చేలా.. సీఎం రేవంత్‌ తన మార్క్ వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ బలం పెరిగేలా.. బీఆర్ఎస్‌ బలం మీద దెబ్బకొట్టేలా స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు.

NANDAMURI BALAKRISHNA: బాలయ్యను టార్గెట్ చేసిన జగన్‌.. హిందూపురంపై భారీ స్కెచ్

ఇదంతా ఎలా ఉన్నా.. వరంగల్‌లో బీఆర్ఎస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కారు పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు.. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వరంగల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, నేతలు చేరబోతున్నారని తెలుస్తోంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళీతో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు టచ్‌లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ నరేందర్ కాంగ్రెస్‌లో చేరారు.

గ్రేటర్‌ వరంగల్‌లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 66 కాగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది నాలుగు మాత్రమే. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. దీంతో మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే జరిగితే.. కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌, జనగామ మినహా.. అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ఐతే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ జంపింగ్‌లు కొనసాగే అవకాశాలు కనిపిస్తుండడంతో.. బీఆర్ఎస్‌ పార్టీ అలర్ట్ అయింది.