AP CONGRESS: ఏపీ కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా ?

ఏపీ విడిపోయిన తర్వాత 10 యేళ్ళుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కానీ కర్ణాటక ఫలితాలు తెలంగాణలో చూపించాయి. తెలంగాణ రిజల్ట్స్ ఏపీలో చూపిస్తాయి అని నమ్మకం పెట్టుకున్నారు అక్కడి హస్తం పార్టీ లీడర్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 02:02 PMLast Updated on: Dec 14, 2023 | 2:02 PM

Congress In Andhra Pradesh Plans To Revamp Their Party

AP CONGRESS: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసిన కాంగ్రెస్ పార్టీ.. రెండు రాష్ట్రాల్లోనూ ఘోరంగా దెబ్బతింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్‌‌లోనూ జోష్‌ కనిపిస్తోంది. అక్కడి హస్తం నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభావం ఏపీలోనూ కనిపిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అందుకే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతలు తమ వైపు చూస్తున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు చెబుతున్నారు.

Lok Sabha : లోక్ సభలో దాడి చేసింది అందుకేనా..? నిజాలు బయటపెట్టిన నిందితులు

అందులో నిజమెంత..? ఒకప్పుడు కాంగ్రెస్‌కి చెందిన ఇప్పటి వైసీపీ నేతలు.. జగన్‌పై కోపంతో బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా..? ఇప్పుడు ఇదే టాక్ ఏపీలో నడుస్తోంది. కర్ణాటకలో 5 గ్యారంటీలు.. తెలంగాణలో 6 గ్యారంటీలు.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీ విడిపోయిన తర్వాత 10 యేళ్ళుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కానీ కర్ణాటక ఫలితాలు తెలంగాణలో చూపించాయి. తెలంగాణ రిజల్ట్స్ ఏపీలో చూపిస్తాయి అని నమ్మకం పెట్టుకున్నారు అక్కడి హస్తం పార్టీ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపైనే చర్చ సాగింది. ఘర్ వాపసీ పిలుపు ఇచ్చి.. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళని పిలవాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో 60 దాకా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు అసంతృప్త నేతలు బయటపడతారు. వీళ్ళతో పాటు వైసీపీ టిక్కెట్ల కోసం ఆశలు పెట్టుకున్న సెకండ్ కేడర్ లీడర్లు కూడా ఉన్నారు. వీళ్ళందర్నీ తమ పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Kishan Reddy : కిషన్ రెడ్డీ.. మీకు తప్పదు ! రాష్ట్ర అధ్యక్షుడిగా కంటిన్యూ..

ఆ నేతలతో సంప్రదింపులు జరిపేందుకు చేరికలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్‌ డిసైడ్ అయింది. ఈసారి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ఏపీలో ఓట్ల శాతం కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కర్ణాటక, తెలంగాణలో సోషల్ మీడియా క్యాంపెయిన్‌ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు టీమ్ సేవలు వాడుకోవాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం ఏఐసీసీ పెద్దలకు రిక్వెస్ట్ పెట్టనున్నారు. జగన్ పోవాలి.. హస్తం రావాలి అని కొత్త క్యాప్షన్ కూడా కాంగ్రెస్ రెడీ చేసుకుంది. పార్టీలో జోష్ నింపేందుకు అమరావతి, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌లోపే ఏపీలో ఆరు బహిరంగ సభలు పెట్టి AICC నేతలను తేవాలని ఏపీ కాంగ్రెస్‌ నిర్ణయించింది. 2014 నుంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పనిచేయలేదని అంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.

ఏపీలో జిల్లాల వారీగా ప్లాన్స్ రెడీ చేస్తున్నామనీ.. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. కేసీఆర్ చేసింది చాలు అని తెలంగాణ జనం కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారు. ఏపీలోనూ జగన్‌పై వ్యతిరేకతతో తమకు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందనేది భ్రమే అంటున్నారు.