CONGRESS: వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేయండి.. పార్టీని వీడిన వాళ్లకు కాంగ్రెస్ ఆహ్వానం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. హస్తం పార్టీ వదిలి వెళ్ళిన వాళ్ళంతా కుదేలయ్యారు. రెంటా చెడ్డ అన్న సామెతలాగా అయింది వాళ్ళ పరిస్థితి. ఇన్నాళ్ళుగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడి.. ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక బయట ఉండిపోవాల్సి వచ్చింది.
CONGRESS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పై అలకబూని వేరే పార్టీల్లోకి వెళ్ళిన వారికి తిరిగి స్వాగతం పలుకుతోంది PCC. టిక్కెట్లు ఇవ్వలేదని కొందరు.. సరైన ప్రాధాన్యత కల్పించలేదని మరికొందరు.. ఇలా చాలామంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో.. ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళని తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది. గాంధీభవన్‌లో PCC చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
REVANTH PLAN : తెలంగాణలో ఇంటింటికీ బంగారం… రేవంత్ రెడ్డి సర్కార్ భలే ప్లాన్ !
యేళ్ళ తరబడిగా కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారు చాలా మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టిక్కెట్లు ఇస్తారని ఆశపడి.. ముందు నుంచే తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. జనాన్ని టర్న్ చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వాళ్ళకి ఊహించని షాక్ ఇచ్చింది. గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించింది. అంతేకాకుండా చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో వచ్చి చేరిన పెద్ద లీడర్లకు వాళ్ళు కోరుకున్న స్థానాల్లో టిక్కెట్లు ఇచ్చింది. వాళ్ళ అనుచరులకు కూడా అడిగిన చోట్ల సీట్లు కేటాయించారు. దాంతో యేళ్ళ తరబడి కాంగ్రెస్ఖలో పనిచేస్తున్న లీడర్లంతా రోడ్డున పడ్డారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం మీద కోపంతో వేరే పార్టీల్లోకి చేరిపోయారు. ఎక్కువ మంది అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లోనే జాయిన్ అయ్యారు. ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ నడుస్తోందని తెలుసుకున్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అసంతృప్తులు అందర్నీ చేర్చుకుంది. అంతకుముందు ఆ లీడర్లు బండబూతులు తిట్టినా సరే.. కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జెండాలు కప్పుతూనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడానికే బీఆర్ఎస్ వీళ్ళని చేర్చుకుంది తప్ప.. వాళ్ళకి ఎలాంటి పదవులపై హామీలు ఇవ్వలేదు.
కొన్ని నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో ప్రభావం చూపిస్తారు అనుకున్నవాళ్ళకి మాత్రం ఎంతో కొంత ముట్టజెప్పినట్టు టాక్ నడిచింది. తీరా బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. హస్తం పార్టీ వదిలి వెళ్ళిన వాళ్ళంతా కుదేలయ్యారు. రెంటా చెడ్డ అన్న సామెతలాగా అయింది వాళ్ళ పరిస్థితి. ఇన్నాళ్ళుగా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడి.. ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక బయట ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే పార్టీ వదిలి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్లపై సానుభూతితో వ్యవహరించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అసంతృప్తుల కోసం గాంధీభవన్ ద్వారాలు తెరిచి ఉంచారు. పార్టీలోకి వచ్చేవారికి ఎలాంటి షరుతులు విధించం. అలాగే వాళ్ళు కూడా ఆ పదవి కావాలి.. ఈ పోస్ట్ కావాలి అని పేచీలు పెట్టకుండా కామ్‌గా జాయిన్ అవుతానంటేనే తిరిగి చేర్చుకోవాలని నిర్ణయించారు. గాంధీభవన్ తలుపులు తెరవడంతో ఇప్పుడు ఎంతమంది బ్యాక్ టు పెవిలియన్ అంటారన్నది చూడాలి.