TELANGANA CONGRESS: నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు..
దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల కేటాయింపుపై అలక బూనినట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్ టికెట్ నుంచి సంజీవరెడ్డి, పటాన్ చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ కోరారు.

TELANGANA CONGRESS: కాంగ్రెస్ (CONGRESS) లిస్ట్ ప్రకటించినప్పుడల్లా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మొదటి, రెండో జాబితా విషయంలో అదే జరగగా.. థర్డ్ లిస్ట్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. లేటెస్ట్‌గా కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాపై పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ (Damodar Raja Narasimha) అసంతృప్తితో ఉన్నారు. తమ వారికి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Politics : గాడిదపై వచ్చి నిరుద్యోగి నామినేషన్.. తరువాత ఏమైందంటే..
దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు సంబంధించి టికెట్ల కేటాయింపుపై అలక బూనినట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్ టికెట్ నుంచి సంజీవరెడ్డి, పటాన్ చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని దామోదర రాజనర్సింహ కోరారు. ఐతే నారాయణఖేడ్ టికెట్‌ను సురేష్ షేట్కర్‌కు ఇవ్వగా.. పటాన్‌చెరు టికెట్‌ను నీలం మధు (neelam madhu)కు కేటాయించారు. దీంతో దామోదర రాజనరసింహ ఆగ్రహంగా ఉన్నారు. పటాన్ చెరు టికెట్ నీలం మధుకు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నారు. పటాన్‌చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పటి నుంచి పార్టీలో పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐనా పార్టీని వీడకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని.. అలాంటి వ్యక్తికి టికెట్ కేటాయించకపోవడంపై రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పార్టీని వీడడానికి కూడా దామోదర రాజనరసింహ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ASSEMBLY ELECTIONS: నోరు జారింది! జర చూసి మాట్లాడండి! కేసీఆర్, కేటీఆర్ నోట ఓటమి మాట !!
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు దామోదర రాజనరసింహతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నీలం మధుకు టికెట్ ఇవ్వడం వల్ల ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అటు టికెట్‌పై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్లు కాల్చేశారు. పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవరాల్‌గా థర్డ్ లిస్ట్ కాంగ్రెస్‌లో రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.