Congress and BRS: కాంగ్రెస్ నుంచి గెలిచినా గులాబీ గూటికేనా..?
మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయ్. బీఆర్ఎస్ హ్యాట్రిక్ మీద కన్నేసింది. అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. ఈసారి తమదే అధికారం అని కాంగ్రెస్ అంటోంది.
మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయ్. బీఆర్ఎస్ హ్యాట్రిక్ మీద కన్నేసింది. అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. ఈసారి తమదే అధికారం అని కాంగ్రెస్ అంటోంది. నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉన్నా.. అధికారానికి మాత్రం దూరంగానే ఉంటుంది. రెండుసార్లు ఓటర్లు అధికారానికి దూరంగానే ఉంచారు. ఈసారి సానుభూతి ఉంటుందని… అధికారం వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. ఐతే బీఆర్ఎస్‌కు ఆల్టర్నేట్‌గా కాంగ్రెస్‌ను ప్రజలు డిసైడ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే.. వంద కారణాలు వినిపిస్తున్నాయ్!
2018లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు.. తర్వాత గులాబీ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌కు ఓటేసినా.. అభ్యర్థులను గెలిపించినా.. వారు హస్తం పార్టీలోనే ఉండడం డౌటే అనే అనుమానాలు తెలంగాణ ఓటర్లలో వినిపిస్తున్నాయ్. పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ ప్రచారం జరగడం.. కాంగ్రెస్‌లో కొంతమంది అభ్యర్థుల గెలుపు కోసం గులాబీ పార్టీ ఫండింగ్ చేస్తుందనే గుసగుసలు వినిపించడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. దీంతో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ఓటర్లు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌కు ఓటేస్తే గెలిచాక వాళ్లంతా బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారేమో అని సందేహిస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌కు ఎదుర్కొగలదు అని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఐతే బలమైన అభ్యర్థులు లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. దీంతో తెలంగాణ రాజకీయం కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏమైనా ఈసారి తెలంగాణలో ఎన్నికల యుద్ధం అంతకుమించి అనిపించడం మాత్రం కన్ఫార్మ్.