Congress: కాంగ్రెస్‌ మేనిఫెస్టోతో.. కేసీఆర్ ఇంటికేనా..?

42 పేజీల్లో 66 ప్రధాన అంశాలతో ఈ మేనిఫెస్టో ఉంది. అమలు చేస్తారా లేదా అన్నది సంగతి తర్వాత.. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఓటు చాయిస్ కాంగ్రెస్ అనిపించుకోవడానికి అవసరమైన అన్ని హామీలను గుప్పించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 17, 2023 | 08:45 PMLast Updated on: Nov 17, 2023 | 8:49 PM

Congress Manifesto Gives Shock To Brs With Many Guarantees

Congress: అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌ చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలతో విస్తృతంగా జనాల్లోకి వెళ్తున్న హస్తం పార్టీ.. ఇప్పుడు మేనిఫెస్టోతో మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సిక్స్ ప్లస్‌ సిక్స్టీ సిక్స్ అన్నట్లు.. 42 పేజీలతో జంబో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అటు ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా.. ఇంకా తమ దగ్గర చాలా పథకాలు ఉన్నాయని మేనిఫెస్టో ద్వారా చెప్పింది కాంగ్రెస్‌. 42 పేజీల్లో 66 ప్రధాన అంశాలతో ఈ మేనిఫెస్టో ఉంది. అమలు చేస్తారా లేదా అన్నది సంగతి తర్వాత.. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఓటు చాయిస్ కాంగ్రెస్ అనిపించుకోవడానికి అవసరమైన అన్ని హామీలను గుప్పించారు.

Rahul Gandhi: ప్రగతి భవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మారుస్తాం: రాహుల్ గాంధీ

తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నూతన వ్యవసాయ విధానం, రైతు కమిషన్ ఏర్పాటు వంటి ప్రధాన హామీలు ఉన్నాయ్. 18 ఏళ్లు నిండి చదువుకునే ప్రతీ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పాత బకాయిలు చెల్లింపు వంటి హామీలు ప్రధానంగా ఉన్నాయ్. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. తల్లి, తండ్రి లేదా భార్యకు రూ.25 వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేయనున్నట్లు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ప్రతీ జిల్లాలో ఉండే డిమాండ్లు.. వివిధ వర్గాల ఆశలు, అంచనాలు తెలుసుకుని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్.

ఇక అటు ప్రధాన పార్టీగా కాంగ్రెస్‌ రేసులో ఉండటం.. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో.. బీఆర్ఎస్ మేనిఫెస్టో గత పదేళ్ల పాలనే అన్నట్లుగా ఉంది. ఐతే కాంగ్రెస్‌కు మాత్రం.. అధికారంలో లేకపోడమే ప్లస్ అవుతోంది. ఈ మేనిఫెస్టోను ఓటర్లు ఏ మాత్రం నమ్మినా.. ఓట్ల వరద పారడం ఖాయం. ఐతే జనాలు నమ్ముతారా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.