Addanki Dayakar: అయ్యో పాపం.. అద్దంకి దయాకర్‌కు మళ్లీ అన్యాయం..
త్వరలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయ్. అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. రెండుసార్లు అన్యాయం జరగడంతో.. ఎంపీ టికెట్ అద్దంకికి ఇస్తారని అంతా అనుకుంటే మళ్లీ పాత సీనే కనిపించింది. అభ్యర్థుల జాబితాలో అద్దంకి పేరు ఎక్కడా కనిపించలేదు.
Addanki Dayakar: త్యాగాలకు కేరాఫ్‌గా మారిపోయారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. జిల్లా పార్టీ పెద్దలతో పడడం లేదా.. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం వేరే ఆలోచన చేస్తుందా అన్న సంగతి ఎలా ఉన్నా.. అద్దంకికి మళ్లీ అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే బరి నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటే.. పేరు అనౌన్స్ చేసి మరీ హ్యాండ్ ఇచ్చారు. పోనీ.. తర్వాత అయినా న్యాయం చేస్తారు అనుకుంటే ఆ మాట కూడా ఎత్తడం లేదు. త్వరలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయ్.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. రెండుసార్లు అన్యాయం జరగడంతో.. ఎంపీ టికెట్ అద్దంకికి ఇస్తారని అంతా అనుకుంటే మళ్లీ పాత సీనే కనిపించింది. అభ్యర్థుల జాబితాలో అద్దంకి పేరు ఎక్కడా కనిపించలేదు. నిజానికి వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి అద్దంకిని బరిలో దింపుతారని అంతా భావించారు. సెకండ్ లిస్ట్‌లోనూ ఆయన పేరు కనిపించలేదు. దీంతో అద్దంకి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. సీఈసీ సమావేశంలో తెలంగాణలో ఏడు లోక్‌సభ స్థానాలపై చర్చ జరగ్గా.. ఆరు స్థానాలకు పార్టీ పెద్దలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరికి సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్‌కు పార్టీ సీనియర్ నేత మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్‌కు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పేర్లపై సీఈసీలో చర్చ జరిగింది.
ఈ జాబితా దాదాపు ఓకే అయిపోయింది. ఇదంతా ఎలా ఉన్నా.. అద్దంకి పరిస్థితే పాపం అనిపిస్తోంది. పదేళ్లు అధికారంలో లేకపోయినా.. పార్టీ నుంచి ఎప్పుడూ పక్కచూపులు చూడని అద్దంకి.. నిఖార్సైన కాంగ్రెస్ నేతగా పేరు తెచ్చుకున్నారు. ఐతే పదవుల విషయంలో ఆయనకు ప్రతీసారి అన్యాయమే జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కావడం ఖాయమా అనే చర్చ జరుగుతోంది.