Telangana Congress : రంగంలోకి రాహుల్, ప్రియాంక.. టీపీసీసీలో కొత్త జోష్..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. ఓ పక్క సంక్షేమ హామీలు, మరోపక్క పార్టీలో చేరికలతో రోజు రోజుకూ బలం పెంచుకుంటోంది. ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి బస్సు యాత్ర నిర్వహించబోతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. ఓ పక్క సంక్షేమ హామీలు, మరోపక్క పార్టీలో చేరికలతో రోజు రోజుకూ బలం పెంచుకుంటోంది. ఇప్పటికే 6 గ్యారంటీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. నేటి నుంచి బస్సు యాత్ర నిర్వహించబోతోంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణకు రాబోతున్నారు. ములుగు, జయశంకర్ భూపాల్‌పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌లో యాత్ర సాగనుంది. ఇవాళ సాయంత్ర 4 గంటలకు రాహుల్ గాంధీ రామప్పకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ములుగు వెళ్లి సభ నిర్వహిస్తారు. బహిరంగ సభ అనంతరం భూపాల్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ నిరుద్యోగ యువకులతో ర్యాలీ నిర్వహిస్తారు.
19న పెద్దపల్లిలో సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహిస్తారు. తరువాత కరీంనగర్ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. బోధన్‌లో గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులను కూడా రాహుల్ ఈ యాత్రలో కలవబోతున్నారు. అదే రోజు రాత్రి నిజామాబాద్‌లో ర్యాలీ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రకటించిన మేనిఫెస్టే కాంగ్రెస్ ఆరు హామీలకు కాస్త దగ్గరగా ఉండటంతో రాహుల్ ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్ ప్రకటనతో బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి సిచ్యువేషన్‌లో అక్కడ రాహుల్ గాంధీ పర్యటన ఉండటం నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.