సురేఖకు మేమున్నాం, కాంగ్రెస్ ప్రకటన

అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖపై కోర్ట్ లో పరువు నష్టం దావా వేయగా దానిపై కాంగ్రెస్ న్యాయ విభాగం స్పందించింది. కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2024 | 06:10 PMLast Updated on: Oct 08, 2024 | 6:10 PM

Congress Party React Onn Akkineni Family Court Hearing

అక్కినేని ఫ్యామిలీ మంత్రి కొండా సురేఖపై కోర్ట్ లో పరువు నష్టం దావా వేయగా దానిపై కాంగ్రెస్ న్యాయ విభాగం స్పందించింది. కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి తిరుపతి వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రిపై కొండా సురేఖ పై దాఖలు చేసిన నాగార్జున పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలలో తేడాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

నాగార్జున పిటిషన్లో ఒకటి చెప్పారు వాంగ్మూలల్లో మరొకటి చెప్పారని నాగార్జున కోడలు సుప్రియ వాంగ్మూలలో మరొకటి చెప్పారన్నారు. సుప్రియ సాక్షిగా ఎంతవరకు కోర్ట్ పరిగణలోకి తీసుకుంటుందో చూడాలన్నారు. ఈనెల 10వ తేదీన మరొక సాక్షి కూడా రికార్డు కోర్టు చేస్తుందని ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నామని మరోసారి స్పష్టం చేసారు. ఒకవేళ సాక్షుల పరిగణలోకి తీసుకొని మంత్రికి నోటీసులు జారీ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. మంత్రి కొండా సురేఖ పై సామాజిక మాద్యంలో పెడుతున్న పోస్టులపై డీజీపికి రేపు ఫిర్యాదు చేస్తామన్నారు.