అక్కడ సీఎం బిజెపికి మైనస్, కాంగ్రెస్ గెలిచినట్టే…?
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. హర్యానాలో బీజేపీ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అని స్పష్టం చేసాయి.
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. హర్యానాలో బీజేపీ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది అని స్పష్టం చేసాయి. కాంగ్రెస్ పార్టీకి 45% ఓట్ల శాతం వచ్చే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్ కి 55 సీట్లు, బీజేపీకి 26 వచ్చే అవకాశం ఉంది అని తమ రిపోర్ట్ లలో పేర్కొన్నాయి. మిగతా రాజకీయ పార్టీలు INLD+BSP, JJP+ASP, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు అని తెలిపాయి.
స్వతంత్రులు 3-5 సీట్లు గెలిచే అవకాశం ఉందని హర్యానాలో కుల సమీకరణాలు ఎన్నికల ఫలితాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి అని అభిప్రాయపడ్డాయి. జాట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉండగా దళితుల్లో మెజారిటీ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారని ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేసారు. బీజేపీకి రెబెల్ అభ్యర్థుల కారణంగా కూడా మరింత నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రిగా 39 శాతం మంది ప్రజలు భూపిందర్ సింగ్ హుడాను కోరుకున్నారని మనోహర్ లాల్ ఖట్టర్ ను కేవలం 6% మాత్రమే ప్రజలు కోరుకున్నారని, బీజేపీకి ఆయనే ఒక పెద్ద బర్డెన్ గా మారినట్టు కనిపించిందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.