కాంగ్రెస్ వాళ్ళు ఈ సినిమా చూడండి: బండి సంచలన కామెంట్స్
హైదరాబాద్ జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని వీక్షించిన కేంద్ర మంత్రి బండి సంజయ్... సంచలన వ్యాఖ్యలు చేసారు. ది సబర్మతి రిపోర్ట్’ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని వీక్షించిన కేంద్ర మంత్రి బండి సంజయ్… సంచలన వ్యాఖ్యలు చేసారు. ది సబర్మతి రిపోర్ట్’ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది అంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తూనే ఉందన్నారు. క్రికెట్ లో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబురాలు చేసుకునే వాళ్లను ఏమనాలి అని నిలదీశారు. ఇండియా గెలవొద్దని కోరుకునే వాళ్లను ఏమనాలి? అని ప్రశ్నించారు.
ఇప్పటికీ మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్, మినీ ఆఫ్ఘనిస్తాన్ బస్తీలున్నాయన్నారు. సమాజంలో ఇకనైనా మార్పు రావాలని ఆయన విజ్ఞప్తి చేసారు. సబర్మతి వంటి సినిమాలు మరెన్నో రావాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు బండి.