Congress: రాహుల్ గాంధీ యుద్ధం మొదలు పెట్టాడా..!?
గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఇది సినిమా డైలాగే అయినప్పటికీ.. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయనకు తగిలిన గాయాలు కూడా సామాన్యమైనవి కావు. పప్పు అంటూ హేళన చేశారు. రాజకీయం చేతకాదంటూ ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు అనర్హుడిగా ప్రకటించి ఏకంగా పార్లమెంట్ నుంచే బయటికి పంపించేశారు.
ఈ గాయాలన్నిటినీ ఆయుధాలుగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు రాహుల్ గాంధీ. గర్జణ కంటే బలంగా తన వాయిస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ క్యాబినెట్ అనర్హుడిగా ప్రకటించినా వన్ పర్సెంట్ కూడా ఆయన కాన్ఫిడెన్స్ లెవల్ తగ్గలేదు. చావనైనా చస్తాను కానీ సారీ చెప్పేది లేదంటూ తెగేసి చెప్పారు. సారీ చెప్పేందుకు తాను సావర్కార్‌ను కానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పడు ట్విటర్‌లో డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ అని బయో మార్చుకున్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ వేసిన వేటును కూడా ఆయన ఓ గౌరవంలా ట్విటర్ బయోలో పెట్టుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రివర్స్ గిఫ్ట్ ఇచ్చేందుకు రాహుల్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ఇష్యూలో అపోజిషన్ పార్టీలన్నీ బీజీపీని టార్గెట్ చేస్తున్నాయి. రాహుల్‌ను కావాలనే సైడ్ చేశారని విమర్శిస్తున్నాయి. ఇప్పుడు రాహుల్ కూడా ఈ ఇష్యూను టార్గెట్ చేసి బీజేపీ మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే విషయాన్ని పాయింట్‌అవుట్ చేయనున్నారు. తన స్నేహితులను కాపాడుకునేందుకే మోదీ ప్రభుత్వాన్ని నడుతుపున్నాడంటూ గతంలోనే రాహుల్ బ్యాండ్ వాయించి మరీ ప్రాచారం చేశారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని మైకులు పగిలేలా చెప్పారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటికి పంపించేశారు. దీంతో ఇది ఖచ్చితంగా కక్షతీర్చుకునే చర్యే అని బీజేపీని బూచిని చెయ్యనున్నారు రాహుల్ గాంధీ. ఈ ఇష్యూలో ప్రతిపక్షాలను కూడా కలుపుకుని ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ టఫ్ కాంపిటీషన్‌ను ఎదుర్కోక తప్పదు.