పిలిస్తే పట్టించుకోరా.. రమ్మంటే రారా..! కన్నడ ఇండస్ట్రీపై కాంగ్రెస్ ‘హమ్ బాంబ్ లగా దేంగే..!’

అదేంటో కానీ రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య అసలు పడడం లేదు. తెలియకుండానే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2025 | 03:20 PMLast Updated on: Mar 08, 2025 | 3:20 PM

Congress Says Hum Bomb Laga Denge On Kannada Industry

అదేంటో కానీ రాష్ట్రం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య అసలు పడడం లేదు. తెలియకుండానే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ అందరికీ తెలిసిందే. దాన్ని పూడ్చడానికి దిల్ రాజు లాంటి నిర్మాతలు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా వాళ్ళు కూడా ప్రభుత్వంతో మమేకం అయిపోయి పని చేసుకుంటున్నారు. కాకపోతే మన దగ్గర సినిమా టికెట్ రేట్లకు సంబంధించి.. అలాగే బెనిఫిట్ షోస్ ఇవన్నీ చాలా కండిషన్స్ మీద నడుస్తున్నాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్ సిచువేషన్ కర్ణాటకలో కూడా రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. తాజాగా అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన కన్నడ దర్శక నిర్మాతలతో పాటు హీరోలను కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

కర్ణాటకలో సినిమా టికెట్ రేటు గరిష్టంగా 200 రూపాయలకు మించకూడదంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దర్శక నిర్మాతలను కంగారు పెడుతుంది. ఉన్నట్టుండి పిడుగుల పడ్డ ఈ నిర్ణయంతో అక్కడి మేకర్స్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ ఇలా దేనితో సంబంధం లేదు.. థియేటర్ ఏదైనా కూడా రేటు మాత్రం 200 దాటింది అంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది ప్రభుత్వం. మామూలుగా అయితే దక్షిణాది రాష్ట్రాల్లో టికెట్ రేట్ అన్నింటికంటే ఎక్కువగా కర్ణాటకలో.. మరీ ముఖ్యంగా బెంగళూరులో ఉంటుంది. అక్కడ వీకెండ్ లో సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి రేట్ మారుస్తూ ఉంటారు మల్టీప్లెక్స్ నిర్వాహకులు.

ఒక్కోసారి టికెట్ 600 నుంచి 1200 రూపాయల మధ్యలో కూడా అమ్ముతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉంటారు.. మన సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టికెట్ రేట్ల విషయంలో ఎప్పుడూ అక్కడ రగడ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సామాన్యులకు అందుబాటు ధరలో సినిమా టికెట్ రేటు ఉండాల్సిందే అంటున్నారు వాళ్లు. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి కావాల్సింది ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తే.. అసలు విషయం ఈజీగానే బయటపడింది. మార్చి 1 నుంచి 8 మధ్యలో బెంగళూరులో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. దీని ఓపెనింగ్ కు కన్నడ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్స్ దగ్గరికి స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లి ఆహ్వానించారు. కానీ ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు. దీన్ని అధికార పార్టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇగోకు తీసుకున్నారని అర్థమవుతుంది.

దాని ఫలితమే ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఉన్నట్టుండి పడిన టికెట్ రేట్ల పిడుగు. శాండిల్ వుడ్ తీరుపై స్వయానా డిప్యూటీ సిఎం డీకె శివకుమార్ కూడా మండిపడ్డాడు. సినిమా వాళ్ళలో మార్పు రాకపోతే నట్లు, బోల్టులు ఎలా టైట్ చేయాలో మాకు తెలుసంటూ కామెంట్ చేసిన మూడు రోజులకే ఈ టికెట్ రేట్ల పిడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్న సినిమాలకు ఎలాంటి నష్టం లేకపోవచ్చు కానీ ప్యాన్ ఇండియన్ సినిమాలకు మాత్రం భారీ నష్టం తప్పదు. గరిష్టంగా 200 రూపాయల టికెట్ కంటే నిర్మాతలకు కోట్ల నష్టం వస్తుంది. ఇప్పటికే థియేటర్లు నడపలేక చాలా వరకు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లు మూత పడుతున్నాయి. ఇప్పుడు టికెట్ రేట్లు మరింత తగ్గిస్తే తనకు గిట్టుబాటు కాక ఉన్నది కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొత్తానికి ఈ నిర్ణయం మీద కన్నడ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.