Rahul Gandhi : రైతు నోటికాడి బుక్కను లాక్కున్న కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రైతు బంధు పథకం.. ఇటీవల రైతు బంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నకల సంఘం. తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు ఉన్న పలంగా రైతు బంధు పంపిణీ ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 01:58 PMLast Updated on: Nov 27, 2023 | 1:58 PM

Congress Snatched Away The Money Of The Farmer Mlc Kavita

తెలంగాణ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి రైతు బంధు పథకం.. ఇటీవల రైతు బంధు పథకం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నకల సంఘం. తాజాగా అందిన ఫిర్యాదుల మేరకు ఉన్న పలంగా రైతు బంధు పంపిణీ ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు నిధులను ప్రస్తుతం విడుదల చేయవద్దని.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Khammam : ఖమ్మంలో ఐటీ తనిఖీలు.. పట్టుపడిన రూ. 11 కోట్లు ఏ పార్టీనో తెలుసా..?

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ కవిత..

రైతు నోటికాడి బుక్కను లాక్కున్న కాంగ్రెస్. అభద్రతాభావంతో రైతుబంధు ఆపించిన కాంగ్రెస్. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ కు రైతన్నలు బుద్ధిచెప్పాలి. ఢిల్లీ నుంచి వస్తున్న మిడతల దండు పని పట్టాల్సిన సమయం వచ్చింది అని విమర్శించారు. ఇప్పటి వరకు తెలంగాణ హక్కులపై ఒక్కసారి కూడా కాంగ్రెస్ మాట్లాడలేదు. ఇక శాంతి సామరస్యాలను పాడుచేయడానికి బీజేపీ రెచ్చగొడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు మనకు అవసరమా..? అని ఎమ్మెల్సి కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో తెలంగాణ అభివృద్ధి ట్రైలర్ చూసి బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వ్యతిరేకతను చాటుకున్నారని, రైతుల నోటికాడి బుక్కను గుంజుకున్నారని నిప్పులు చెరిగారు. రైతురుణ మాఫీని ఆపిందని, రైతు వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేసుకుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కనిపించని శతృవు.. బీజేపీ బహిరంగ శతృవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాదిరి బుల్డోజర్లు కాదు.. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవాలన్నది మా ఆలోచన.

మతం పేరు చెప్పి మంటలు పెట్టాలని ఒక పార్టీ చూస్తోందని, మరొక పార్టీ కులం పేరు చెప్పి కుతంత్రం చేసే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ఉపాధి హామీ కార్మికుల పొట్టకొడుతున్న బీజేపీని.. కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదు? బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందే కాంగ్రెస్. మరో వైపు తెలంగాణ ఎన్నకల ప్రచారంలో పాల్గొన్న.. ప్రియాంక గాంధీ మాటలు విని నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. 10 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని యువత ప్రశ్నించాలి అని అన్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న నాయకులు తిరిగి ఢిల్లీ వెళ్తారు.. ఇక్కడే ఉండేది సీఎం కేసీఆర్ మాత్రమే అనే ప్రజలకు చేప్పుకోచ్చారు ఎమ్మెల్సి కవిత.