YS SHARMILA: షర్మిల చేరికతో టీ కాంగ్రెస్‌లో వర్గ పోరు.. వ్యతిరేకిస్తున్న రేవంత్ వర్గం..!
షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తోంది అనే వాదన మొదలైనప్పటి నుంచీ రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిసిన నేపథ్యంలో ఈ ఇష్యూ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
YS SHARMILA: షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు సర్వం సిద్ధం చేయడంతో టీపీసీసీలో టెన్షన్ మొదలైంది. షర్మిలను టీపీసీసీలోకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పాలేరు నుంచి షర్మిలను పోటీకి దింపడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తోంది అనే వాదన మొదలైనప్పటి నుంచీ రేవంత్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిసిన నేపథ్యంలో ఈ ఇష్యూ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పాలేరు నుంచి ఆమెను పోటీకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. కానీ రేవంత్ రెడ్డి వర్గం మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు చంద్రబాబును కూడా తమతో కలుపుకున్నాయి. టీడీపీ ఎంట్రీతో కేసీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. మళ్లీ ఆంధ్రా పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేశారు. కూటమిలో చంద్రబాబు కూడా ఉండటంతో ప్రజలు వ్యతిరేకించారు.
ఇప్పుడు కాంగ్రెస్‌లోకి షర్మిలను తీసుకుంటే మళ్లీ అదే రిపీట్ అవుద్దని రేవంత్ వాదిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు మాత్రం షర్మిలను స్వీకరించలేదు. ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే అది పార్టీకే నష్టమంటోంది రేవంత్ వర్గం. అయితే కోమటి రెడ్డి వర్గం మాత్రం షర్మిలను ఆహ్వానిస్తోంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను తాము స్వీకరిస్తామని.. నాలుగు ఓట్లు వచ్చినా అది కాంగ్రెస్ పార్టీకి మంచిదే అంటూ రీసెంట్‌గా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయితే రేవంత్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆంధ్రా కాంగ్రెస్‌లో షర్మిలకు స్థానం కల్పించి ఎక్కడినుంచైనా పోటీ చేయించండి కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం షర్మిల రాకను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్తున్నారట రేవంత్. తుమ్మల త్వరలోనే కాంగ్రెస్‌లో జాయిన్ కాబోతున్నారని.. పాలేరు నుంచి ఆయనను పోటీలో దింపాలని అధిష్టానానికి సూచించారట. షర్మిల ఇంకా కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వకుండానే మొదలైన ఈ గందరగోళం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.