CONGRESS: ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. తెలంగాణ రాజకీయాలపై సంచలన సర్వే..
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని బీజేపీ అంటుంటే.. ఈసారి హవా మాదే అంటున్నాయ్ మిగిలిన రెండు పార్టీలు. దీంతో ఎవరిది విజయం.. ఎవరికి ఎక్కువ సీట్లు అనేదానిపై తెలంగాణలో చర్చ జరుగుతోంది.
CONGRESS: తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ మళ్లీ మొదలైంది. విజయాన్ని కంటిన్యూ చేయాలని ఒక పార్టీ.. ప్రతీకారం తీర్చుకోవాలని మరోపార్టీ.. ఢిల్లీకి గిఫ్ట్ ఇద్దామంటూ ఇంకో పార్టీ.. లోక్‌సభ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయ్. బీజేపీ ఇప్పటికే 9స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాయ్.
Prashant Kishor: నిన్ను నమ్మలేం బాస్.. ప్రశాంత్ కిషోర్ మాటలు జనం నమ్ముతారా..?
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని బీజేపీ అంటుంటే.. ఈసారి హవా మాదే అంటున్నాయ్ మిగిలిన రెండు పార్టీలు. దీంతో ఎవరిది విజయం.. ఎవరికి ఎక్కువ సీట్లు అనేదానిపై తెలంగాణలో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుందని ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 17లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా 9స్థానాలను హస్తం పార్టీ గెలవనుందని అంచనా వేస్తోంది. బీజేపీ 5 చోట్ల విజయం సాధిస్తుందని చెప్పింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని లెక్కలేస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితం కానుందని అంచనా వేసింది.
అసదుద్దీన్ సారధ్యంలోని ఎంఐఎం పార్టీ ఒక సీటులో విజయం సాధిస్తుందని చెప్పింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాయ్. ఐతే లోక్‌సభ ఎన్నికలపై ఒక్కో సర్వే ఒక్కోలా చెప్తోంది. ఐతే సర్వేలు నిజం కావాలని ఏమీ లేదు. దీంతో పార్టీలన్నీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయ్. అన్ని రకాలుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నాయ్.