Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కే పట్టం ఖాయమా ? బీజేపీని దెబ్బతీసేది అదేనా ?

ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్ కర్ణాటకలో ! ఎలక్షన్స్‌ వేళ జరుగుతున్న పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. జంపింగ్‌లు, షిఫ్టింగ్‌లు, ఆరోపణలు, ఆగ్రహాలు.. విమర్శలు, విసుర్లు.. ఓ రేంజ్‌ అనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నట్లే దక్కించుకొని.. ఆ తర్వాత కోల్పోయిన కాంగ్రెస్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని భావిస్తుంటే.. హస్తానికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్నింటికి మించి.. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 05:30 PMLast Updated on: Apr 24, 2023 | 5:30 PM

Congress Won The Karnataka Elections In 2023

పొరుగు రాష్ట్రం కావడం.. అక్కడి రాజకీయం.. ఇక్కడ ప్రభావం చూపించడంతో.. ఏం జరుగుతుందా అని జనాలంతా ఆసక్తిగా గమనిపిస్తున్నారు. ఏపీతో కంపేర్ చేస్తే కన్నడ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో ప్రభావం చూపించడం ఖాయం. కర్ణాటక ఎన్నికల ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై కూడా ఉంటుంది. 2018 ఎన్నికల్లో 104స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. టాప్‌లో నిలిచింది. ఐతే మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచారు. దీంతో బీజేపీని ఎలాగైనా అధికారానికి దూరంగా ఉంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

80స్థానాలతో రెండోస్థానంలో నిలిచినా.. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. కేవలం 37స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. కట్‌ చేస్తే ఎన్నికలు వచ్చేశాయ్. బీజేపీ మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వినిపించాయ్. దీంతో ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో మొదలైంది. ఐతే ఒకట్రెండు మినహా సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని చెప్తున్నాయ్. ఏబీపీ సీఓవర్‌ ఒపీనియన్ పోల్‌ కూడా అదే విషయం చెప్పింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సీ ఓటర్‌ సర్వే తెలిపింది. బీజేపీకి 74, జేడీఎస్‌కు 29 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు రావచ్చని తెలిపింది. గత ఎన్నికల్లో 38శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌… ఈసారి రెండు శాతం ఓట్లను అధికంగా దక్కించుకోనుంది. గత ఎన్నికల్లో 36 శాతం ఓట్లను రాబట్టుకున్న బీజేపీ ఈసారి 34.7 శాతానికే పరిమితం కాబోతున్నదని ఒపీనియన్ పోల్‌తో తేలింది.

కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలలో నిరుద్యోగం కీలకంగా మారనుందని పోల్‌లో తేలింది. విద్యుత్‌, నీళ్లు, రహదారులులాంటి అంశాలతో పాటూ.. మత విద్వేషాలు, హిజాబ్‌ వివాదం, శాంతి భద్రతల అంశాలు కూడా కీలకపాత్ర పోషించబోతున్నాయ్.