Sukesh Chandrasekhar: కౌంట్ డౌన్ మొదలైంది బ్రదర్..! కేటీఆర్, కవితకు సుఖేష్ వార్నింగ్ లేఖ..

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుకెళ్ళిన సుఖేష్ చంద్రశేఖర్.. జైలు నుంచే అడ్వకేట్స్ ద్వారా లెటర్స్ పంపుతున్నాడు. లేటెస్ట్‌గా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఈ ఇష్యూని బేస్ చేసుకొని లెటర్ రిలీజ్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 04:58 PMLast Updated on: Dec 08, 2023 | 4:58 PM

Conman Sukesh Chandrashekhar Fires Salvo At Brs Leaders After Loss In Telangana

Sukesh Chandrasekhar: మనీలాండరింగ్‌ కేసులో మండోలి జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన లెటర్ సంచలనంగా మారింది. కేటీఆర్, కవితను టార్గెట్ చేస్తూ ఈ లెటర్ రిలీజ్ చేశారు. మీకు కౌంట్ డౌన్ మొదలైంది బ్రదర్.. త్వరలోనే మీరు జైలుకెళ్తారు అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి పంపిన లెటర్ వైరల్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుకెళ్ళిన సుఖేష్ చంద్రశేఖర్.. జైలు నుంచే అడ్వకేట్స్ ద్వారా లెటర్స్ పంపుతున్నాడు. లేటెస్ట్‌గా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఈ ఇష్యూని బేస్ చేసుకొని లెటర్ రిలీజ్ చేశాడు.

Supreme Court: బాలికల లైంగిక వాంఛలు.. హైకోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు..

“డియర్ కేటీఆర్ బ్రదర్, కవిత అక్కయ్య.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సాధించిన ఫలితాలకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ అబద్ధాలు, మీ అత్యాశలు, మీ అవినీతి.. తెలుగు ప్రజలందరికీ అర్థమైంది. మీ అహంకారం, బూటకపు పరాక్రమాలు అన్నీ అంతమవుతాయని.. నేను కొన్ని నెలల క్రితమే చెప్పా. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారు. మీకు ఇచ్చిన సంపూర్ణ అధికారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మీ అవినీతిని, అహంకారాన్ని జనమంతా అర్థం చేసుకున్నారు. నన్ను మోసగాడన్నారు. కానీ ఈరోజు మీరు అదే స్థానానికి వచ్చారు. ఇప్పుడు మీకూ, నాకూ పెద్దగా తేడా ఏమీ లేదు. మీ అవినీతి విషయంలో నిజాయితీ నిరూపించుకోడానికి సిద్ధంగా ఉండాలి. త్వరలోనే మీరు మీ భాగస్వాములైన కట్టర్, అవినీతి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో జైలు క్లబ్‌లో చేరతారు” అని కామెంట్ చేశారు సుఖేష్ చంద్రశేఖర్. మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది బ్రదర్.. త్వరలోనే జైలుకి వెళ్తారు అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన కామెంట్స్ చేశాడు సుఖేష్. కవిత చట్టబద్దంగా విచారణ ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని లేఖలో కోరారు.

న్యాయ స్థానాలు, సామాన్య జనం కంటే ఎవరూ పెద్దవాళ్ళు కాదని.. వారి నిర్ణయమే ఫైనల్ అని తెలిపాడు. ఇంకా కేటీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు సుఖేష్ చంద్రశేఖర్. త్వరలోనే మీకిష్టమైన ఇల్లున్న అమెరికా వెళ్లిపోతారని తెలిపాడు. “ఫలితాల రోజు ట్విట్టర్‌లో తుపాకీ పట్టుకుని 3.0 అని మీరు పోస్ట్ చేశారు. కానీ నిజాయితీగా అంచనా వేస్తే.. మిమ్మల్ని మీరు ఫూల్ అవుట్ చేయాలనుకున్నారు. మీరు చెబుతున్న 3.0 జైల్ టైమ్ తొందర్లోనే జరుగుతుంది” అని కేటీఆర్ ట్వీట్స్‌పై ఎద్దేవా చేశాడు. తెలంగాణ సీఎం రేవంత్ అన్నకు అభినందనలు అంటూ సుఖేష్ చంద్రశేఖర్ లెటర్లో రాశాడు.