Chandrababu Naidu: కోర్టులో చంద్రబాబుకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణ ఇదే..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ పొడిగించే సమయంలో చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణ ఇది.
Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ పొడిగించే సమయంలో చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, జడ్జికి మధ్య జరిగిన సంభాషణ ఇది.
న్యాయమూర్తి: మీ రిమాండ్ అయిపోయింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
బాబు: నన్ను అకారణంగా అరెస్టు చేశారు. మీరు అన్యాయంగా నన్ను రిమాండుకు పంపారు. రాష్ట్రంలో, దేశంలో నేనేంటో అందరికీ తెలుసు. నేను మానసికంగా కుంగిపోయాను. జైల్లో నా పరిస్థితి బాగోలేదు. దోమలు తీవ్రంగా వేధిస్తున్నాయి. నాకు ఏసీ సౌకర్యం కూడా లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది.
న్యాయమూర్తి: మిమ్మల్ని అన్యాయంగా జైలుకి పంపారని ఎందుకు అనుకుంటున్నారు? మీపై సీఐడీ చేసింది ఆరోపణలు మాత్రమే. అవి రుజువు కాలేదు. చట్ట ప్రకారమే మిమ్మల్ని రిమాండుకు పంపాం. మీరు అసహనానికి గురి కావొద్దు. మీరు మాజీ ముఖ్యమంత్రి. సాధారణ వ్యక్తి కాదు. మీకు చట్టం తెలుసు. చట్ట ప్రకారమే మేం నడుచుకుంటాం. కోర్టులు వ్యక్తిగత కక్షతో వ్యవహరించవు.
బాబు: అరెస్టు చేసే ముందు నాకు సీఐడీ ఒక అవకాశం ఇస్తే బాగుండేది. సీఐడీకి పూర్తిగా సహకరించేవాడిని.
న్యాయమూర్తి: మిమ్మల్ని కస్టడీ కోసం సీఐడీ వాళ్లు అలడుగుతున్నారు. మీ లాయర్లు మిమ్మల్ని కస్టడీకి ఇవొద్దని అంటున్నారు.
బాబు: (మౌనం!)
ఇదే కేసులో న్యాయమూర్తికి, లాయర్లకు మధ్య జరిగిన సంభాషణ)
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి: చంద్రబాబుగారిని రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుతిస్తున్నాం! మీరు (సీఐడీ లాయర్లను ఉద్దేశించి) జైల్లోనే ఆయన్ని ప్రశ్నిస్తారా? లేదూ.. ఒక తటస్థ ప్రదేశంలో ప్రశ్నిస్తారా?
చంద్రబాబుగారిని బయటకు తీసుకొస్తే మీకు (సీఐడీకి) రెండు రోజుల సమయం వృథా అయిపోతుంది. జైల్లోనే సీఐడీ కస్డడీలో ప్రశ్నిస్తే సమయం ఆదా అవుతుంది.
సీఐడి: మాకు ఐదు నిమిషాల సమయం ఇవ్వండి, నిర్ణయం తీసుకుంటాం.
(ఐదు నిమిషాల తర్వాత )
సీఐడీ తరఫు లాయర్లు: మేం జైల్లోనే, మా కస్టడీలోనే నిందితుడిని ప్రశ్నిస్తాం.
చంద్రబాబు లాయర్: కస్టడీలో సీఐడీ విచారణ చేసిన వీడియోలు గతంలో బయటకు వచ్చాయి.
న్యాయమూర్తి: కస్టడీలో నిందితుడిని ప్రశ్నించినప్పుడు ఆ వీడియోలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
చంద్రబాబు లాయర్: అడ్వకేట్ల సమక్షంలోనే ప్రశ్నించాలి.
సీఐడీ: ఎంతమంది అడ్వకేట్లను అనుమతించాలి.
న్యాయమూర్తి: ఒకరు లేదా ఇద్దరిని అనుమతించవచ్చు.