CPM-CONGRESS: సీపీఎం పోటీతో కాంగ్రెస్‌‌కే నష్టం.. ఓట్ల చీలికతో బీఆర్ఎస్‌కు లాభం..

తెలంగాణలో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది సీపీఎం. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లల్లో పోటీ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. అంతగా ఆదరణ కూడా లేదు. ఈ జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటాలంటే.. కమ్యూనిస్టుల బలం కూడా అవసరం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2023 | 03:15 PMLast Updated on: Nov 06, 2023 | 3:15 PM

Cpm Contesting In Assebly Elections Make Huge Loss To Congress

CPM-CONGRESS: ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టులు.. ఇప్పుడు సీట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీల వెంట తిరగాల్సి వస్తోంది. సీపీఐ (CPI), సీపీఎం (CPM) రెండు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికల్లో BRS వెంట నడిచాయి. కానీ కేసీఆర్ (KCR) సీట్లు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ (CONGRESS) పంచన చేరాయి. అక్కడా అనుకున్న స్థానాలు రాబట్టలేక సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. కానీ సీపీఐ మాత్రం కాంగ్రెస్ రాజీ పడింది. ఒక్క అసెంబ్లీ సీటుతో పాటు.. భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ ప్రామిస్ చేసింది.

CM KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం..

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో ఉన్న అవగాహన వల్ల ఇక్కడ సర్దుకుపోతున్నామని సీపీఐ లీడర్లు చెప్పారు. అయితే తెలంగాణలో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది సీపీఎం. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లల్లో పోటీ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. అంతగా ఆదరణ కూడా లేదు. ఈ జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటాలంటే.. కమ్యూనిస్టుల బలం కూడా అవసరం. కానీ సీపీఎం అడిగిన 5 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. కాస్తో.. కూస్తో బీజీపీకి పడటంతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, BSP కూడా ఈ ఓట్లను చీల్చుకునే ఛాన్సుంది. సీపీఎం అభ్యర్థులు ప్రకటించిన 14 స్థానాలు కాంగ్రెస్‌కు కూడా కీలకమైనవి.

TELANGANA CONGRESS: కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి.. బండి సంజయ్ చెప్పిందే జరగబోతుందా..?

వీటిల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏదో ఓ రకంగా సీపీఎంను ఒప్పించకుండా పంతానికి పోవడం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీపీఎం మాత్రం.. బీజేపీయే తమ టార్గెట్ అని చెబుతోంది. కానీ ఇలా చతుర్ముఖ పోటీలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం కలగనుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే పరోక్షంగా బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే ఛాన్సుంది. సరే ఎవరి గెలుపు ఎలా ఉన్నా.. ఆధిక్యం మాత్రం తక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.