కరోనాలో కొడుకు, ఇప్పుడు సీతారాం ఏచూరి… కుటుంబంలో తీవ్ర విషాదం
సిపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత నెల 19 న ఢిల్లీ ఎయిమ్స్ లో ఆస్పత్రిలో జాయిన్ అయిన సీతారాం ఏచూరి... నేడు కన్నుమూసారని పార్టీ ప్రకటించింది.
సిపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత నెల 19 న ఢిల్లీ ఎయిమ్స్ లో ఆస్పత్రిలో జాయిన్ అయిన సీతారాం ఏచూరి… నేడు కన్నుమూసారని పార్టీ ప్రకటించింది. కొడుకు మరణించిన మూడేళ్ళకే సీతారాం ఏచూరి కూడా కన్నుమూయడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 2021 లో కుమారుడు ఆశిష్ కరోనాలో ప్రాణాలు విడిచారు. స్వస్థలం కాకినాడ అయినా ఆయన పుట్టింది మాత్రం చెన్నైలోనే.
1975 లో సీపీఏం ప్రాధమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి… అప్పటి నుంచి పార్టీలో అంచెలు అంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బాల్యం మొత్తం ఆయన కాకినాడలోనే గడిపారు. 1975 లో ఎమర్జెన్సీ సమయంలో ఆయనను అరెస్ట్ చేసారు. ఆ తర్వాత చదువుకి ముగింపు పలికారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంయే ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో విడుదల తర్వాత అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు.