పవన్ టూర్ లో అపశ్రుతి, రోగి మృతిపై విమర్శలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుంటూరు అటవీ శాఖ అమరుల సంస్మరణ సభకు హాజరైన పవన్ కళ్యాణ్ కోసం రహదారిని బ్లాక్ చేసారు పోలీసులు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుంటూరు అటవీ శాఖ అమరుల సంస్మరణ సభకు హాజరైన పవన్ కళ్యాణ్ కోసం రహదారిని బ్లాక్ చేసారు పోలీసులు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పోలీసుల వాహనంతో కలెక్టరేట్ ఎదురు రోడ్డు నిండిపోయింది. చిలకలూరిపేట నుంచి హాస్పటల్ కోసం వచ్చినటువంటి రోగి సంబంధించిన అంబులెన్స్ కూడా ఆగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
శ్వాస సంబంధిత ఇబ్బందితో రోగి బాధపడుతున్నట్లు అంబులెన్స్ లో ఉన్న బాధితులు చెప్పారు. అయితే శ్వాస అందక సిపిఎస్ చేయాల్సిన పరిస్థితి వచ్చి హార్ట్ ఆగిపోయినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ముందుగానే అంబులెన్స్ కు దారి ఇచ్చుంటే ప్రమాదం ఉండకపోవచ్చని విమర్శలు వస్తున్నాయి. కొద్ది సమయం తర్వాత అంబులెన్స్ ని పోలీసులు పంపించారు.